హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ సంబరం.. సాంస్కృతిక సౌరభం.. హుస్సేన్ సాగర్ తీరానికి సరికొత్త సొబగులను అద్దాయి. కళారూపాల ప్రదర్శనలు సమ్మోహనపర్చాయి.
తీరొక్క పూల బతుకమ్మలు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పాటలతో వర్ణ శోభితాన్ని తలపించాయి.
బుద్ధ విగ్రహం సమీపంలో లేజర్, బాణాసంచా ప్రదర్శనలు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచాయి. శకటాలు ఆకట్టుకున్నాయి.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ), భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై ఆదివారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవోపేతంగా సాగాయి.
గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు, మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు తదితర ప్రముఖులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
కూకట్‌పల్లిలోనూ సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మొత్తంగా భాగ్యనగర వ్యాప్తంగా ఆధ్యాతి్మక శోభ అలరారింది.


