హైదరాబాద్ : అదిరేటి డ్రెస్సులు..స్టైలిష్ మేకోవర్లు..ర్యాంప్ వాక్‌లతో సోమాజిగూడలోని విల్లామేరి కాలేజీ ప్రాంగణం సందడిగా మారింది. (Villa Marie College)
శుక్రవారం ‘ది క్రియేటివ్ స్పెక్ట్రమ్’ పేరిట నిర్వహించిన ఫ్యాషన్ వేడుకలో విద్యార్థినులు తమ సృజనాత్మకతను చాటుకున్నారు.
వినూత్న వస్త్రధారణ, ఆధునిక ఫ్యాషన్ పోకడలతో అదరగొట్టారు.
‘స్కెచ్ టు స్పాట్ లైట్’ ఈవెంట్లో విద్యార్థినులు స్వయంగా డిజైన్ చేసిన దుస్తులతో రెడ్ కార్పెట్‌పై మెరిసిపోయారు. ప్రత్యేకమైన ఫ్యాషన్ లుక్స్‌తో ఆకట్టుకున్నారు.
చదువుతో పాటు సృజనాత్మక రంగాల్లోనూ విద్యార్థినులు రాణించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని కాలేజీ గౌరవ కార్యదర్శి చిన్నమ్మ అన్నారు.


