హైదరాబాద్ : బాలల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కోలాటం, బతుకమ్మ, జానపద నృత్యాలు ఎంతగానో అలరించాయి.
శుక్రవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ బాలోత్సవంలో నగరంలోని సుమారు 100 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు.


