"బట్టల రామస్వామి బయోపిక్కు" సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్తాఫ్ హసన్.. నటిస్తూ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ "రాజిగాడు రాజయ్యాడు".
బత్తుల పర్విన్, మనోజ్ అర్రోల, చిన్ని నిర్మిస్తున్నారు. అను శ్రీ హీరోయిన్ కాగా ప్రముఖ కవి, గాయకుడు డా.గోరటి వెంకన్న కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్ర టీజర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గురువారం జరిగింది.


