అమాంతం అడవి ఏనుగు రైడర్‌పై అటాక్‌..!ట్విస్ట్‌ ఏంటంటే.. | Viral Video: Royal Enfield rider in Uttarakhand falls in front of wild elephant | Sakshi
Sakshi News home page

సడెన్‌గా బైక్‌ స్కిడ్‌..ఇంతలో అడవి ఏనుగు అటాక్‌! చివరికి ఏమైందంటే..

Nov 14 2026 4:29 PM | Updated on Nov 14 2026 4:29 PM

Viral Video: Royal Enfield rider in Uttarakhand falls in front of wild elephant

.ఒక బైకర్‌కి అడవి ఏనుగుతో భయంకరమైన అనుభవం ఎదురైంది. పాపం చావుతప్పి కన్ను లొట్టపోయింది అన్నట్లుగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ అనూహ్య ఘటన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ రిషికేష్‌ హైవేపై జాలిగ్రాంట్‌ విమానాశ్రయం సమీపంలో చోటు చేసుకుంది. ఆ బైకర్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై ధర్జాగా వస్తుంటే..అనుకోకుండా బైక్‌ స్కిడ్‌ అయ్యి కిందపడిపోయాడు. 

లేచేలోపే అనూహ్యంగా అడవి ఏనుగు ఎంట్రీ ఇచ్చి..అమాంతం రైడర్‌పై దాడిచేసింది. అది అతడిని కాళ్లతో తొక్కేయడానికి ప్రయత్నిస్తుండగా..సమీపంలోని ప్రజలు శబ్దం చేసి దాన్ని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. ఆ భయానికి ఆ ఏనుగు వెంటనే పారిపోయే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో ఆ బైకర్‌ని రెండు సార్లు తొక్కేసింది. 

చెప్పాలంటే ఆ భయానక దృశ్యంలో మనోడు బతికే ఛాన్స్‌ లేదనేలా ఒళ్లుగగుర్పొడ్చేలా జరిగింది. అదృష్టవశాత్తు ఆబైకర్‌ ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియోని రాహుల్ జోస్ అనే యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. బాధితుడు క్షేమంగానే ఉన్నట్లు వెల్లడించాడు పోస్ట్‌లో. 

తాను ఆ సంటఘటన జరిగిన స్థలంలోనే ఉన్నానని..ప్రజల అరుపులకు ఆ ఏనుగు బెదిరి పారిపోయిందని రాసుకొచ్చాడు. అంతేగాదు జాతీయ పార్కు సమీపంలోని హైవేపై జాగ్రత్తగా ఉండండి అంటూ తన పోస్ట్‌ని ముగించాడు. ఒక రకంగా ఈ ఘటన అడవి సమీపంలోని రహదారుల గుండా వెళ్లేటప్పుడూ వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని నొక్కి చెబుతోందంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు.

 

ఇదీ చదవండి: తరాలు మారినా.. అదే రుచి, అదే సువాసన..! ఇప్పటికీ ఆ వృద్ధుడే స్వయంగా

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement