ఐటీ వదిలి ఫుడ్‌ స్టార్టప్‌..తొమ్మిది నెలల్లో రూ. 56 లక్షల టర్నోవర్‌! | From IT Jobs To Food Startup Success, Bengaluru Couple Builds Wellfed Into Rs 56 Lakh Business In Nine Months, Watch Video For Details | Sakshi
Sakshi News home page

ఐటీ వదిలి ఫుడ్‌ స్టార్టప్‌..తొమ్మిది నెలల్లో రూ. 56 లక్షల టర్నోవర్‌!

Nov 13 2026 12:41 PM | Updated on Nov 13 2026 12:49 PM

Bengaluru Couple Quit IT Jobs Built Healthy Meal Startup Earned Rs 56 Lakh

ఐటీ ఉద్యోగాలు చేస్తున్నప్పుడూ భోజనం కోసం రెస్టారెంట్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లపై ఆధారపడేవారు. అలా ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నప్పుడూ ఎదురైన అనుభవం ఆహార వ్యాపార ఆలోచనకు తెరతీసింది. అన్నేసి గంటలు ఉద్యోగాలు చేసేవాళ్లు మధురంగా భోజనం చేయడం అంత సులభం కాదు. ఆ నేపథ్యంలోనే ఈ జంట ఆరోగ్యకరమైన ఆహారం అందించే పుడ్‌స్టార్టప్‌ని ప్రారభించింది ఈ జంట. అలా తొమ్మిది నెలల్లోనే మంచి సక్సెస్‌ అందుకుని ఔత్సాహిక స్టార్టప్ యువకులకు స్ఫూర్తిగా నిలిచారు. మరి వారి సక్సెస్‌ మంత్ర ఏంటో చూద్దామా..!.

ఆ దపంతులే బెంగళూరుకి చెందిన దియా-ఆదిత్యలు. ఇద్దరూ కంప్యూటర్‌ సైన్స్‌ చదివి ఒకే ఐటీ కంపెనీలో ఉద్యోగం ప్రారంభించారు. వారు కార్పొరేట్‌ రంగంలో మూడేళ్లకు పైగా గడిపారు. చాలామంది ఉద్యోగస్తుల మాదిరిగా తమ రోజువారీ భోజనం కోసం తరుచుగా రెస్టారెంట్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లపై ఆధారపడేవారు. తమ బిజీ షెడ్యూల్‌ కారణంగా ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో తరుచుగా వెనకబడిపోయేవారమని ఆదిత్య గుర్తుచేసుకున్నారు. 

తాము కొన్ని రోజులు బయట ఆహారం ఆర్డర్‌ పెట్టుకోగా..ఒక్కోసారి తన భార్య దియా తమ కోసం వంట చేసేదని చెప్పుకొచ్చారు. అయితే ఇలా ఉద్యోగాలు చేస్తూ ఇంట్లో వంట అంటే చాలా శ్రమతో కూడకున్నది. పైగా రోజంతా ఒక క్యూబికల్‌లో అధిక ఒత్తిడితో కూడిన వాతావరణంలో గడిపే వారికి కుకింగ్‌ అనేది చాలా పెద్ద విషయం. అప్పుడే మాకు అనిపించింది ఆన్‌లైన్‌లో ఆరోగ్యకరమైన ఆహారం దొరికితే ఎలా ఉంటుదనే ఆలోచన వచ్చిందట. 

అయితే అలాంటి వంటకాలేవి మన ఫుడ్‌ యాప్స్‌లో లేకపోవడంతో తామే మంచి రుచిని అందించే తాజా ఆహారాన్ని అందించాలని అనుకున్నారట. అది కూడా సరసమైన ధరలకు అందించాలని అనుకున్నారట. అలా తాము 2022 సెప్టెంబర్‌లో తమ ఎంబీఏ చదువుల కోసం ఐటీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెల్‌ఫెడ్‌ ఫుడ్‌ స్టార్టప్‌ని ప్రారంభించారు. వాళ్లు దీన్ని రూ. 15 లక్షలతో ప్రారంభించారు. అందులో ఎక్కువ భాగం వారి వ్యక్తిగత పొదుపు నుంచి వచ్చిందే. 

ప్రారంభంలో తమ బృందంలో ఇద్దరు వ్యవస్థాపకులు, ఒక పోషకాహార నిపుణుడు, ఒక వంటవాడు, ఒక సహాయకుడు, ఒక డెలివరీ వ్యక్తితో సహా ఆరుగురుసభ్యులు ఉన్నారు. తొలుత ఆ జంట తమ భోజనాన్ని తమ స్నేహితులు, కుటుంబసభ్యులకు పంపడం ప్రారంభించారు. అయితే తమ బిజినెస్‌ క్లిక్‌ అయ్యింది మాత్రం ఒక పోషకాహార నిపుణురాలి వల్ల అని చెప్పుకొచ్చారు. ఆమె ఆ జంట అందించే భోజనంకు సంబంధించిన రీల్‌ు పంచుకోవడంతో దాదాపు వందమంది కస్టమర్లు వచ్చారు. 

అలా క్రమేణ ఎక్కువమంది ఈ స్టార్టప్‌ చేరుకోవడానికి ఆ వీడియో ఎంతగానే ఉపకరించింది. అయితే 2026 ప్రారంభంలో ఎల్‌పీజీ కొరత వంటివి తమ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. పైగా అందుకు అనుగుణంగా తమ మెనూని కూడా మార్చక తప్పలేదన్నారు. దాంతో మళ్లీ వ్యాపార వృద్ధి మందగమనంలో సాగిందని చెప్పుకొచ్చింది ఈ జంట. పప్పు, ఆలుగోబీ, జొన్న రొట్టె, అద్రకి చికెన్‌, చోలే చాట్‌, వంటి సుపరిచితమైన భారతీయ వంటకాల తోపాటు పనీర్‌, టోపు, సోయా, చికెన్‌ వంటి ప్రోటీన్‌ అధికంగా ఉండే ఆహారాలు కూడా ఉంటాయని చెప్పుకొచ్చారు. 

అలాగే ర్యాప్‌లు, బిర్యానీలు, ఇండో చైనీస్‌ ఫేవరెట్స్‌ వంటి ప్రత్యేక భోజనలాలు కూడా అందిస్తామని చెప్పుకొచ్చారు. వాళ్ల సక్సెస్‌ మంత్ర ఏంటంటే..వారం రోజుల ప్లాన్‌, రెండు వారాల ప్లాన్‌ ధరలు అందిస్తూ..కస్టమర్‌కి ఉచిత డెలివరీ సదుపాయం అందిస్తున్నారు. కొన్నింటిలో రాత్రి భోజన డెలివరీ ఉచితం వంటి సదుపాయాలు కూడా ఉ‍న్నాయి. 

అలాగే ప్లాస్టిక్‌ని నివారిస్తూ..మహారాష్ట్రలోని ఒక తయారీదారు నుంచి స్టీల్ లైనింగ్‌తో కూడిన పునర్వినియోగ లంచ్ కంటైనర్లను ఉపయోగించడం విశేషం. జొమాటో లేదా స్విగ్గీ వంటి సాధారణ ఫుడ్ డెలివరీ అప్లికేషన్ నుంచి వచ్చిన ప్యాకేజ్‌ల్లా కాకుండా ఇంట్లో తయారు చేసిన భోజనం ఆస్వాదించిన అనుభూతి అందించడమే తమ ధ్యేయం అని అంటున్నారు ఈ దంపతులు. అలా ఈ ఫుడ్‌ స్టార్టప్‌ తొలి ఏడాదిలోనే రూ. 45 లక్షలు ఆర్జించింది. 

అలాగే జనవరి నుంచి సెప్టెంబర్ 2026 మధ్య, ఈ స్టార్టప్ రూ. 56 లక్షల ఆదాయాన్ని ఆర్జించి, కేవలం తొమ్మిది నెలల్లోనే తన తొలి ఏడాది ఆదాయాన్ని అధిగమించింది. ఇప్పటివరకు, ఈ కంపెనీ 1,500 మందికి పైగా వినియోగదారులకు సేవలు అందించి, 55,000కు పైగా భోజనాలను డెలివరీ చేసింది.

 

ఇదీ చదవండి: Self-Respect Marriage: ఆత్మగౌరవ వివాహ పద్ధతిలో ఒక్కటైన అనిరుధ్‌-కావ్య మారన్‌లు! ఎలా నిర్వహిస్తారంటే..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement