టీమిండియా స్టార్ క్రికెటర్ అర్షదీప్ సింగ్ ఒకేరోజున రెండు శుభవార్తలు విన్నాడు. సంచలన ట్రేడింగ్‌లో ముంబై ఇండియన్స్ గూటికి అర్షదీప్ చేరడం మొదటిదైతే, రెండోది అతడు వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు.
ఈ బుధవారం న్యూజిలాండ్ గడ్డపై తన గర్ల్‌ఫ్రెండ్ సమ్రీన్ కౌర్ చేతికి రింగు తొడిగి నిశ్చితార్థం చేసుకున్నాడు.
మౌంట్ మాంగనూయ్‌లోని అందమైన ప్రదేశంలో మోకాళ్లపై నిలబడి సమ్రీన్ కౌర్‌కు ప్రపోజ్ చేసిన అర్షదీప్ ఆ తర్వాత ఆమె చేతికి రింగును తొడిగాడు.
ఆ తర్వాత సమ్రీన్ తన చేతి వేలికి అర్షదీప్ తొడిగిన రింగును చూపిస్తూ ఫొటోలకు ఫోజివ్వడాన్ని ముంబై ఇండియన్స్ షేర్ చేసుకుంది.
సమ్రీన్ కౌర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. "జీవితం మనకిచ్చిన అత్యంత అద్భుతమైన కానుక.. మనమిద్దరం కలవడమే. ఇకపై మన జర్నీ జీవితాంతం కలిసి సాగుతుంది. హాయ్ ఫియాన్సీ" అంటూ సమ్రీన్ కౌర్ భావోద్వేగమైన క్యాప్షన్ రాసుకొచ్చింది.
దీంతో ఈ జంటకు క్రికెట్ అభిమానులు, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


