ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham) టీజర్ తాజాగా విడుదలైంది.
ప్రియదర్శి, సరసన నాగదుర్గ నటిస్తున్నారు.
వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు.
సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై సుకుమార్, బన్నీ వాస్, తబితా సుకుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
గ్రామీణ నేపథ్యం, పల్లెటూరి సంప్రదాయాలు, కుటుంబ విలువలు, భావోద్వేగాలు మరియు విడాకుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది.
ఈ సినిమాను డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.


