breaking news
Naga Durga
-
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘పేరుగల్ల పెద్దిరెడ్డి’ సాంగ్
తెలంగాణ జానపదలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని, నృత్యకారిణి నాగదుర్గ నుంచి తాజాగా విడుదలైన పాట ‘పేరుగల్ల పెద్దిరెడ్డి’ ప్రస్తుతం యూట్యూబ్‌లో మరియు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ, ఈ కొత్త పాటతో మరోసారి ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. పేరుగల్ల పెద్దిరెడ్డి అంటూ వచ్చిన ఈ పాట తండ్రి మీద ప్రేమతో కూతురు చెబుతున్న నేపథ్యంలో ఉంది. పల్లెటూరి వాతావరణాన్ని, జానపద లయను ప్రతిబింబిస్తూ ఈ పాట ఆకట్టుకుంటుంది. ఎప్పటిలాగే, నాగదుర్గ ఈ పాటలో తనదైన శైలిలో చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. శుక్రవారం విడుదలైన ఈ పాట కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సాధిస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది. పల్లె జానపద పాటల అభిమానుల మధ్య ఈ పాట క్రేజీ హిట్‌గా మారడంతో నాగదుర్గ ఖాతాలో మరో విజయవంతమైన జానపద పాట చేరింది. ఈ పాటకు బుల్లెట్ బండి లక్ష్మణ్ సాహిత్యం అందించగా.. మమత రమేష్ గానం చేశారు. సంగీతాన్ని మదన్ కే అందించారు. -
Naga Durga: బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.. కానీ నాకు గొడవ పడటం అస్సలు రాదు..
-
నాగదుర్గ హీరోయిన్గా తొలి చిత్రం..‘కలివి వనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
తెలుగు ఫోక్ డ్యాన్సర్‌కి తమిళంలో హీరోయిన్ ఛాన్స్
ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలు మాత్రమే. ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. యూట్యూబ్‌లోనూ పలు ఆల్బమ్ సాంగ్స్ మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. అందులో యాక్ట్ చేసిన వాళ్లు మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాంటి వాళ్లలో నాగదుర్గ ఒకరు. గత కొన్నేళ్లలో ఫోక్ సాంగ్స్ చేస్తూ పేరు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు ఏకంగా తమిళంలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి 'కాంతార-1')దారిపొంటత్తుండు, నా పేరు ఎల్లమ్మ, ఎర్ర రుమాల్, కాపోళ ఇంటికాడ తదితర సాంగ్స్‌తో ఈమె బోలెడంతమంది అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే 'కలివనం' అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా చేసినప్పటికీ ఇది రిలీజైందో, ఎప్పుడో రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. కొన్నిరోజుల క్రితం ఈమె.. తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లోనూ పాల్గొంటుందని అన్నారు. కానీ అవి రూమర్స్ మాత్రమే అని తేలిపోయింది.అలాంటిది ఇప్పుడు తమిళ సినిమాలో నాగదుర్గకు అవకాశం దక్కింది. ప్రముఖ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్.. గతేడాది 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అనే డబ్బింగ్ చిత్రంతో హీరోగా మారాడు. ఇప్పుడు ఈ కుర్రాడు కొత్త సినిమాలోనే నాగదుర్గ హీరోయిన్గా చేయనుంది. ఒకవేళ ఇది క్లిక్ అయితే తమిళంలో మరిన్ని అవకాశాలు రావొచ్చు. ఈమె కంటే ముందు శాన్వి మేఘన, గౌరీప్రియ లాంటి పలువురు తెలుగమ్మాయిలు తమిళ సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నారు. బాగానే పేరు సంపాదించారు. ఎటొచ్చి టాలీవుడ్లోనే తెలుగమ్మాయిలు హీరోయిన్స్‌గా కనిపించట్లేదు!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)


