తెలుగు ఫోక్ డ్యాన్సర్‌కి తమిళంలో హీరోయిన్ ఛాన్స్ | Folk Singer Nagadurga Debuts as Heroine in Tamil Cinema with Dhanush’s Nephew | Sakshi
Sakshi News home page

Naga Durga: బిగ్‌బాస్ 9లోకి వస్తుందనుకుంటే.. ఇప్పుడు హీరోయిన్ అయిపోయే

Oct 27 2025 1:50 PM | Updated on Oct 27 2025 3:21 PM

Folk Dancer Naga Durga New Tamil Movie

ఒకప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ అంటే సినిమాలు మాత్రమే. ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. యూట్యూబ్‌లోనూ పలు ఆల్బమ్ సాంగ్స్ మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. అందులో యాక్ట్ చేసిన వాళ్లు మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాంటి వాళ్లలో నాగదుర్గ ఒకరు. గత కొన్నేళ్లలో ఫోక్ సాంగ్స్ చేస్తూ పేరు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు ఏకంగా తమిళంలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.

(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి 'కాంతార-1')

దారిపొంటత్తుండు, నా పేరు ఎల్లమ్మ, ఎర్ర రుమాల్, కాపోళ ఇంటికాడ తదితర సాంగ్స్‌తో ఈమె బోలెడంతమంది అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే 'కలివనం' అనే తెలుగు సినిమాలో హీరోయిన్‌గా చేసినప్పటికీ ఇది రిలీజైందో, ఎప్పుడో రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. కొన్నిరోజుల క్రితం ఈమె.. తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్‌లోనూ పాల్గొంటుందని అన్నారు. కానీ అవి రూమర్స్ మాత్రమే అని తేలిపోయింది.

అలాంటిది ఇప్పుడు తమిళ సినిమాలో నాగదుర్గకు అవకాశం దక్కింది. ప్రముఖ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్.. గతేడాది 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అనే డబ్బింగ్ చిత్రంతో హీరోగా మారాడు. ఇప్పుడు ఈ కుర్రాడు కొత్త సినిమాలోనే నాగదుర్గ హీరోయిన్‌గా చేయనుంది. ఒకవేళ ఇది క్లిక్ అయితే తమిళంలో మరిన్ని అవకాశాలు రావొచ్చు. ఈమె కంటే ముందు శాన్వి మేఘన, గౌరీప్రియ లాంటి పలువురు తెలుగమ్మాయిలు తమిళ సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నారు. బాగానే పేరు సంపాదించారు. ఎటొచ్చి టాలీవుడ్‌లోనే తెలుగమ్మాయిలు హీరోయిన్స్‌గా కనిపించట్లేదు!

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement