breaking news
Folk dance
-
‘ఇడుపు కాయితం’ వివాదం.. ట్రెండింగ్‌లో తెలంగాణ పిల్ల
‘ఇడుపు కాయితం’.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా టైటిల్ గురించే చర్చ. ఈ సినిమాని ఏపీలో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తారా అని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. మా యాసని అవమానిస్తారా అంటూ తెలంగాణ నెటిజన్స్, మెధావులు ఫైర్ అవుతున్నారు. టైటిల్‌ని అవమానిస్తూ వెతకారంగా పెట్టిన పోస్టులకు కౌంటర్‌గా తెలంగాణ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇలా ఈ వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల నెటిజన్స్ మధ్య పెద్ద చర్చకు తెరలేపింది. అయితే ఈ క్రమంలో ‘ఇడుపు కాయితం’ హీరోయిన్ నాగదుర్గ గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఆమె చేసిన ఫోక్ సాంగ్స్ వీడియో క్లిప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగదుర్గ నేపథ్యం గురించి, ఆమె కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు..→ తెలంగాణ జానపద పాటలకు ఈ మధ్య ఆదరణ పెరిగింది. సినిమాల్లోనూ తెలంగాణ ఫోక్ సాంగ్స్‌ని వాడుతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని పల్లె మట్టివాసనలు గల ఎంతో మంది కళాకారులు వెలుగులోకి వస్తున్నారు. వారిలో డిజిటల్ స్క్రీన్‌పై, యూట్యూబ్ జానపద గీతాల్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతూ 'ఫోక్ స్టార్'గా గుర్తింపు తెచ్చుకున్న నృత్యకారిణి నాగదుర్గ (గుత్తా నాగదుర్గ) ఒకరు.→ నాగదుర్గ స్వస్థలం నల్గొండ జిల్లా అడ్డగూడూరు. ఆమె తల్లిదండ్రులు గుత్తా చలపతిరావు, వాసవి దంపతులు ఉద్యోగరిత్యా నల్గొండ పట్టణంలో స్థిరపడ్డారు. పదో తరగతి వరకు నల్గొండలోనే చదివిన నాగదుర్గ.. ఇంటర్, డిగ్రీ, పీజీ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి కూచిపూడి నృత్యంలో మాస్టర్స్ (పీజీ) పూర్తి చేశారు.→ నాగదుర్గకు చిన్నతనం నుంచే నృత్యంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. స్థానిక రామాలయంలో జరిగే భజనలు, నృత్యాలను చూసి ఇంటికొచ్చాక చున్నీ కట్టుకుని డాన్స్ ప్రాక్టీస్ చేసేదట. కూతురిలోని ఈ తపనను గమనించిన తల్లి వాసవి.. ఆమెను నాట్యం వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నాగదుర్గనే చెప్పారు.జానపదంతో జాతకం మారింది→ కూచిపూడి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నాగదుర్గ కోవిడ్ సమయంలో జానపద గీతాల వైపు అడుగులు వేసింది. కోవిడ్ టైమ్‌లో అప్పటికే యూట్యూబ్‌లో రిలీజ్ అయిన 'ధన్ ధన ధన్' అనే ఫోక్ సాంగ్‌కి స్టెప్పులేసి ఆ వీడియోని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిందట. అది చూసే తొలి పాట ‘తిన్నా తీరం పడతలే’ చాన్స్ వచ్చింది. ఫోక్ డ్యాన్సర్‌గా ఎంట్రీ ఇచ్చిన తొలి పాటనే సూపర్ హిట్ అయింది. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత నాగదుర్గు జాతకమే మారిపోయింది.→ కూచిపూడి నేర్చుకోవడం వల్ల నాగదుర్గకు ముఖ కవళికలు (ఎక్స్ప్రెషన్స్) పలకడం చాలా సులువైంది. జానపద పాటల్లోని ఎనర్జిటిక్ స్టెప్స్‌కు తన క్లాసికల్ హావభావాలను జోడించి ఆమె చేసిన డ్యాన్స్ వీక్షకులను కట్టిపడేసింది. అందుకే ఆమె చేసిన తొలి సాంగ్ ‘తిన్నా తీరం పడతలే’ నుంచి ఇటీవల వచ్చిన ‘లగారే సౌండ్ సాలా’ వరకు ప్రతి పాట మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఆమె కట్టు బొట్టు, పల్లెటూరి పడచులా అమాయకత్వంతో కూడిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో ఆమెను స్టార్‌ను చేశాయి.→ నాగదుర్గకు గ్లామర్ దుస్తుకంటే సాంప్రదాయ చీరకట్టు, హాఫ్ శారీస్ అంటేనే ఇష్టం. స్క్రీన్‌పై కూడా మితిమీరిన గ్లామర్‌కు ఆమె ఒప్పుకోరు. అందుకే చాలా సినిమా అవకాశాలను వదులుకుంది.→ సినిమా ఇండస్ట్రీలో తనకు రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఎనలేని అభిమానమని, ఆయన సినిమాలో ఒక చిన్న పాత్ర దొరికినా చాలని ఓ ఇంటర్వ్యూల్లో నాగదుర్గ చెప్పింది.→ తెలుగులోలో కలివి వనం అనే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో ‘లవ్ ఓ లవ్’ అనే సినిమా చేసింది. ఇప్పుడు ప్రియదర్శి జోడిగా ఇడుపు కాయితం అనే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రాన్ని సుకుమార్, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ చేశారు. ఇందులో ‘శ్రీలత’ అనే తెలంగాణ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా టైటిలే ఇప్పుడు నెట్టింట నాగదుర్గను ట్రెండింగ్‌గా మార్చింది. -
హీరోయిన్గా మారిన ‘రాను బొంబాయికి రాను’ భామ!
‘రాను బొంబాయికి రాను’ ఫోక్ సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. లిరిక్స్ కంటే ఎక్కువగా రామ్ రాథోడ్, లిఖిత వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు ఈ ఒక్క పాటతో లిఖిత..తెలుగు ఆడియన్స్‌కి బాగా దగ్గరైంది. ఈ పాట తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. అయితే ఇన్నాళ్లు ప్రైవేట్ ఆల్బమ్స్‌తో అలరించిన లిఖిత..ఇక ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది. నటుడు, దర్శకుడు కృష్ణ మాయ ఆమెను టాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నాడు. సామ్రాట్, డీమోన్ పవన్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘సాV3’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ‘సాV3’ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హీరోయిన్ లిఖిత మాట్లాడుతూ - డైరెక్టర్ గారు ఈ స్క్రిప్ట్ చెబుతున్నప్పుడే మూవీ ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా తెలిసింది. నేను ఫోక్ సాంగ్స్ నుంచి చిన్న గ్యాప్ తీసుకున్నాను. హీరోయిన్ గా మంచి రోల్స్ చేయాలనే ఫోక్ సాంగ్స్ కు గ్యాప్ ఇచ్చాను. అయినా మంచి ఆల్బమ్ వస్తే తప్పకుండా చేస్తాను. నేను ఒక బెస్ట్ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్న టైమ్ లో ఈ మూవీ ఆఫర్ వచ్చింది. సామ్రాట్, పవన్ లాంటి కోస్టార్స్ దొరకడం హ్యాపీగా ఉంది. వాళ్లు తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకుంటారు. ప్రొడక్షన్ పరంగా ఎక్కడా రాజీపడకుండా మా విజయ గారు నిర్మించారు. ఎలాంటి స్క్రిప్ట్ పేపర్ లేకుండా మేమంతా కథను ఓన్ చేసుకుని నటించాం. అదంతా మా డైరెక్టర్ వల్లే సాధ్యమైంది’ అన్నారు.దర్శకుడు కృష్ణమాయ మాట్లాడుతూ... లిఖి, డీమోన్ పవన్ కొత్త వాళ్లు ఎలా నటిస్తారో అనుకున్నాను గానీ పర్ ఫార్మెన్స్ ఇరగదీశారు. వాళ్లకు ఇప్పటిదాకా సరైన మూవీ రాలేదని అనిపించింది. సాయి కార్తీక్ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుంది. మా టెక్నీషియన్స్ అందరూ అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చారు. ‘సాV3’ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం’ అన్నారు.హీరో డీమోన్ పవన్ మాట్లాడుతూ - బిగ్ బాస్ తర్వాత నేను ఎలాంటి మూవీ చేయాలని ఆలోచిస్తున్న టైమ్ లో డైరెక్టర్ కృష్ణ మాయ ఈ స్క్రిప్ట్ చెప్పారు. చాలా మంచి స్క్రిప్ట్ ఇది. ఆయన స్క్రిప్ట్ చెబుతుంటే ఇంకా వినాలని అనిపించింది. అంత ఎక్స్ ప్రెసివ్ గా స్టోరీ చెప్పారు. ఇలాంటి దర్శకుడితో వర్క్ చేస్తే నటుడిగా నాకు మంచి పేరొస్తుందని నమ్మాను. మేమంతా ఈ సినిమా కోసం ఎలాంటి డైలాగ్స్ లేకుండా ఆన్ సెట్ ఇంప్రూవైజ్ చేసుకుంటూ నాచురల్ గా నటించాం. సామ్రాట్ క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. అలాగే లిఖితకు హీరోయిన్ గా మంచి పేరు వస్తుంది. తక్కువ టైమ్ లో మేమంతా క్వాలిటీగా సినిమా చేశాం. అన్నారు. -
Naga Durga: బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.. కానీ నాకు గొడవ పడటం అస్సలు రాదు..
-
తెలుగు ఫోక్ డ్యాన్సర్‌కి తమిళంలో హీరోయిన్ ఛాన్స్
ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలు మాత్రమే. ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. యూట్యూబ్‌లోనూ పలు ఆల్బమ్ సాంగ్స్ మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. అందులో యాక్ట్ చేసిన వాళ్లు మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాంటి వాళ్లలో నాగదుర్గ ఒకరు. గత కొన్నేళ్లలో ఫోక్ సాంగ్స్ చేస్తూ పేరు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు ఏకంగా తమిళంలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి 'కాంతార-1')దారిపొంటత్తుండు, నా పేరు ఎల్లమ్మ, ఎర్ర రుమాల్, కాపోళ ఇంటికాడ తదితర సాంగ్స్‌తో ఈమె బోలెడంతమంది అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే 'కలివనం' అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా చేసినప్పటికీ ఇది రిలీజైందో, ఎప్పుడో రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. కొన్నిరోజుల క్రితం ఈమె.. తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లోనూ పాల్గొంటుందని అన్నారు. కానీ అవి రూమర్స్ మాత్రమే అని తేలిపోయింది.అలాంటిది ఇప్పుడు తమిళ సినిమాలో నాగదుర్గకు అవకాశం దక్కింది. ప్రముఖ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్.. గతేడాది 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అనే డబ్బింగ్ చిత్రంతో హీరోగా మారాడు. ఇప్పుడు ఈ కుర్రాడు కొత్త సినిమాలోనే నాగదుర్గ హీరోయిన్గా చేయనుంది. ఒకవేళ ఇది క్లిక్ అయితే తమిళంలో మరిన్ని అవకాశాలు రావొచ్చు. ఈమె కంటే ముందు శాన్వి మేఘన, గౌరీప్రియ లాంటి పలువురు తెలుగమ్మాయిలు తమిళ సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నారు. బాగానే పేరు సంపాదించారు. ఎటొచ్చి టాలీవుడ్లోనే తెలుగమ్మాయిలు హీరోయిన్స్‌గా కనిపించట్లేదు!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్) -
గలీజ్ మాటలు.. నా జీవితంతో ఆడుకుంటున్నారు.. బతకను: జానులిరి
జాను లిరి (Janu Lyri).. జానపద పాటలతో చాలా ఫేమస్ అయింది. యూట్యూబ్‌లో ఫోక్ సాంగ్స్‌కు హుషారుగా స్టెప్పులేసే జాను.. తర్వాత ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 షో విన్నర్‌గానూ నిలిచింది. పదో తరగతిలోనే పెళ్లి చేసుకున్న ఈ డ్యాన్సర్‌కు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా వీరు విడిపోయారు. అయితే జాను ఏం చేసినా సరే కొందరు తనను విమర్శిస్తూనే ఉన్నారు. ఈ మధ్య ఓసారి మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లికి కూడా సిద్ధమే అంది. దాన్ని కూడా తప్పుపడుతూ తనను ట్రోల్ చేస్తున్నారు.గుక్కపెట్టి ఏడ్చిన జానుఈ విమర్శలను జాను లిరి భరించలేకపోయింది. నన్ను టార్గెట్ చేయడం ఆపండి అంటూ బోరుమని ఏడుస్తోంది. ఈ మేరకు పలు వీడియోలు షేర్ చేసింది. నా జీవితంతో ఆడుకుంటున్నారు. నేను నవ్వితే ఓవరాక్షన్.. నాకు పద్ధతి తెలీదు..కదా? ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకుని డ్యాన్స్ చేస్తుంది నేనే. కెమెరా ముందు ఒకలా, వెనక ఒకలా ఉండను. అందరితో నవ్వుతూ ఉంటాను. నేనేం చేసినా తప్పే అంటున్నారు.బతకాలని లేదుఇన్‌స్టాగ్రామ్‌లో నా వాయిస్‌కు గలీజ్ మాటలు యాడ్ చేస్తున్నారు. అవి నా కొడుకు చూడడా? ఎక్కడికైనా వెళ్లి చచ్చిపోవాలనిపిస్తోంది. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే మాత్రం మీరే కారణం. ఇంత నరకమా? మీ వ్యూస్ కోసం ఒకమ్మాయి జీవితాన్ని రోడ్డుమీద పడేస్తున్నారు. మా అమ్మానాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక్క మాట అనకుండా పెంచారు. కానీ ఈరోజు అడ్డమైన వెధవలతో మాటలు పడుతున్నాను. సూసైడ్ తప్పు అని నలుగురికీ చెప్పేదాన్ని.. కానీ ఇప్పుడర్థమవుతోంది.నా వల్ల కావట్లేదువాళ్లు పడే బాధల వల్ల చనిపోవట్లేదు. మీరు చేసే రచ్చ తట్టుకోలేక చనిపోతున్నారని! నా వల్ల కావట్లేదు. నా ఓపిక నశించింది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అన్నయ్యతో మాట్లాడినా, అక్కతో మాట్లాడినా, నవ్వినా, కూర్చున్నా.. ఎందుకు నిందలేస్తున్నారు? నా గురించి మంచి పెట్టొచ్చు కదా.. బాధ తట్టుకోలేకపోతున్నా.. నా జీవితంతో ఆడుకోవడం ఎందుకు? నా వల్ల మీకేమైనా హాని జరిగిందా? నా కొడుకును బాగా చదివించి మంచి స్థాయిలో చూడాలనుకున్నాను. అప్పటివరకు నేను బతకనని నాకర్థమవుతోంది. నేను మధ్యలోనే పోతాను అంటూ జాను వెక్కి వెక్కి ఏడ్చేసింది. View this post on Instagram A post shared by Jimmidi Jhansi - Janulyri (@janulyri_official) ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: హీరోయిన్ రెచ్చగొట్టింది.. అందుకే సిక్స్ ప్యాక్ చేశా: అల్లు అర్జున్ -
లోకల్ టాలెంట్ కాదు అమెరికాస్ గాట్ టాలెంట్
కాళ్ల కింద రెండు గ్లాసులు, తల మీద గ్లాస్‌పై గ్లాస్ పద్దెనిమిది గ్లాస్లు పెట్టుకొని వాటిపై కుండ పెట్టుకొని రెండడుగులు వేయడమే కష్టం. అలాంటిది డ్యాన్స్ చేయడం అంటే మాటలు కాదు కదా! రాజస్థాన్‌కు చెందిన ప్రవీణ్ ప్రజాపత్ నిన్న మొన్నటి వరకు లోకల్ టాలెంట్. ఇప్పుడు మాత్రం అమెరికాస్ గాట్ టాలెంట్. ఫోక్ డ్యాన్సర్ అయిన ప్రవీణ్‌కు అమెరికాస్ గాట్ టాలెంట్ (ఏజీటి)లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకొని ‘స్టాండింగ్ ఒవేషన్’ అందుకున్నాడు. కాళ్ల కింద 2 గ్లాసులు(డ్యాన్స్ ప్రారంభంలో) తల మీద 18 గ్లాస్లు వాటిపై ఒక కుండతో ప్రవీణ్ చేసిన ‘మట్కా భవ’ డ్యాన్స్ ఆడిటోరియంను ఉర్రూతలూగించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. -
చిన్నారులతో కలిసి హుషారుగా గంతులేసిన సీఎం
దిస్పూర్: నిత్యం తన స్టేట్మెంట్లతో, దూకుడు నిర్ణయాలతో వార్తల్లో నిలిచే అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. హుషారుగా జానపద నృత్యంతో ఆకట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం తన నివాసంలో జరిగిన ఓ ఈవెంట్లో ఆయన సందడి చేశాడు. అంతేకాదు.. ఆ వీడియోను స్వయంగా ఆయనే ట్విటర్లో పోస్ట్ చేశారు. ఝుమూర్ ప్రదర్శనను చూస్తూ ఉండలేకపోయా అంటూ తన ఉత్సాహాన్ని చెప్పకనే చెప్పారాయన. హతింగా టీఈ మోడల్ స్కూల్ విద్యార్థులు.. సీఎం స్వగృహంలో ఆదివారం సాయంత్రం పలు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ముందుగా అస్సాం టీ తోటల్లో పని చేసే వాళ్ల సంప్రదాయ నృత్యం ‘ఝూమూర్’ ప్రదర్శన ఇచ్చారు. అందులో ఆయన సైతం వాళ్లతో కలిసి డ్యాన్స్‌లు చేశారు. ఈ సందర్భంగా.. వాళ్లను ఉత్సాహపరిచే ఉద్దేశంతో స్టేజ్ ఎక్కిన సీఎం హిమంత శర్మ.. స్టెప్పులేశారు. ఆయన్ని చూసి మరికొందరు విద్యార్థినిలు స్టేజ్ ఎక్కారు. ఇక శర్మ భార్య రింకీ భూయాన్ శర్మ కూడా వాళ్లతో కలిశారు. ఈ కార్యక్రమానికి జానపద సంగీత వాయిద్యకారులు పద్మశ్రీ దులాల్ మాన్‌కీ, ప్రముఖ సింగర్ గీతాంజలి దాస్ సైతం హాజరై ప్రదర్శన ఇచ్చారు. కార్యక్రమం తర్వాత సీఎం హిమంత శర్మ.. విద్యార్థులతో కలిసి డిన్నర్ చేశారు. An evening to cherish! Couldn't help but join the students of Hatinga TE Model School of Biswanath performing jhumur at my residence. pic.twitter.com/rsZXzhB1vK — Himanta Biswa Sarma (@himantabiswa) January 9, 2023 -
Jogati Manjamma Story: చచ్చిపోదామని విషం తాగాను
-
వారినలా విసిరివేయకండి: చచ్చిపోదామని విషం తాగాను
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న జానపద నృత్యకారిణి మంజమ్మ జోగతి. పద్మశ్రీ పొందిన తొలి ట్రాన్స్‌విమెన్. కేవలం జోగప్పలకు పరిమితమైన జోగతి నృత్యాన్ని మరింత విస్తరించాలనేది ఆమె కల. ఈ నేపథ్యంలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగానే ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు మంజమ్మ. పదిహేనేళ్లు ఉన్నప్పుడు ట్రాన్స్‌జెండర్‌గా కుటుంబానికి దూరమయ్యారు. ఇంటినుంచి బైటపడి బతుకుదెరువు కోసం వీధుల్లో భిక్షాటన చేయడమే కాదు, ఆమె పలుమార్లు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఒకానొక దశలో విషం తాగి చచ్చిపోవాలకుని ఆత్మహత్యాయత్నం చేశారు. కానీ ప్రాణాలతో బయటపడ్డారు. అయినా 20 మంది తోబుట్టువులతో సహా ఆమె కుటుంబ సభ్యులెవరూ తనను పలకరించేందుకు ఆసుపత్రికి రాలేదని ఆమె వాపోయారు. ఈ అవార్డు ద్వారా, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ హక్కులను గుర్తించి వారికి విద్య, ఉద్యోగాలు అందించేలా ప్రభుత్వాలు పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యం చేయకుండా, మూలకు విసిరి వేయకుండా తనలాంటి ట్రాన్స్‌జెండర్ పిల్లలను ఆదరించాలని ఆమె ఉద్వేగ భరితంగా చెప్పుకొచ్చారు. మంజమ్మ అసలు పేరు మంజునాథ్ శెట్టి. 1964 ఏప్రిల్ 18న బళ్లారి, కల్లుకాంబ గ్రామంలో హనుమంతయ్య, జయలక్ష్మి దంపతులకు జన్మించిన మంజునాథ్ అలియాస్ మాత మంజమ్మ జోగతి జీవిత విశేషాలపై ఆసక్తికర వీడియో మీకోసం.. -
జానపద చంద్రిక
జానపద నృత్యాలు చేయడంలో తనకు తానే సాటి అనిపించుకుంటోంది చిన్నారి శతాక్షి. ఐదవ తరగతిలో చేరే నాటికే దాదాపు 500ల ప్రదర్శనలు ఇచ్చింది. అవధేశ్శర్మ, సీతాశర్మల కుమార్తె శతాక్షి. వీరిది ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరం. ప్రస్తుతం నల్గొండజిల్లా చిట్యాలలో ఉంటున్నారు. శతాక్షి తండ్రి స్థానికంగా మార్బుల్స్ గ్రానైట్ కంపెనీ మేనేజర్‌గా, తల్లి బ్యుటీషియన్ పనిచేస్తున్నారు. నార్కెట్‌పల్లిలోని శ్రీవిద్యాపీఠంలో ఐదవ తరగతి చదువుతున్న శతాక్షి చిన్నప్పటి నుంచి టీవీల్లో వచ్చే నృత్య ప్రదర్శనలు ఆసక్తిగా తిలకించడమే కాదు, అందుకు అనుగుణంగా నృత్యం చేసేది. అప్పుడు ఆలవాటైన ఆ నృత్య కదలికలు ఇప్పుడు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఫస్ట్ క్లాసులో ఉన్నప్పుడు పాఠశాల వార్షికోత్సవంలో జానపద నృత్యం చేసి అందరినీ ఆకట్టుకుంది. మొదటి బహుమతి కూడా గెలుచుకుంది. ఈ నృత్యం ఎంత గుర్తింపు తెచ్చిందంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా శతాక్షి ‘జానపద నృత్యం’ తప్పనిసరిగా ఉండేది. ఇటీవల రవీంద్రభారతి వేదికపై ‘ కైకలూరి సిన్నదాన్ని’ అనే జానపద పాటకు అనుగుణంగా రయ్ రయ్ అంటూ నృత్యం చేస్తుంటే ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. చప్పట్ల హోరుతో హాలు మార్మోగిపోయింది. ‘‘అమ్మో... చిన్నారి కాదు... పిడుగు... జింక పిల్లలా నృత్యం చేస్తుంటే చూడడానికి అందంగా... ఆనందంగా ఉంది’’ అని రాష్ట్ర సాంస్కృతికశాఖ సంచాలకులు రాళ్లబండి కవితాప్రసాద్ ఆనందంతో ఆశ్చర్యపోతే, ‘‘జానపద నృత్యకారిణిగా శతాక్షి భవిష్యత్తులో ఉన్నతస్థాయికి చేరుకుంటుంది’’ అని దూరదర్శన్ డెరైక్టర్ శైలజా సుమన్ కితాబు ఇచ్చారు. 2011లో కొత్తగూడెంలో బాలల దినోత్సవం సందర్భంగా జరిగిన రాష్ట్ర స్థాయి జానపద నృత్య పోటీల్లో ప్రథమ బహుమతి సొంతం చేసుకున్న శతాక్షి కేవలం జానపద నృత్యాల్లోనే కాకుండా సినిమా పాటలు, వెస్ట్రన్ మ్యూజిక్‌కి అనుగుణంగా నృత్య ప్రదర్శన చేయటంలో ప్రావీణ్యత సాధించింది. చదువుకు ఆటంకం రాకుండా సెలవు రోజుల్లో నాట్యగురువు వీరునాయుడు దగ్గర మెలకువలు నేర్చుకుంటున్న శతాక్షి ‘‘అంతర్జాతీయ ఫోక్ డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకోవాలని ఉంది, నృత్య ప్రదర్శనల ద్వారా వచ్చిన డబ్బుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తాను’’ అంటోంది. చిన్నారి శతాక్షి కోరిక నెరవేరాలని కోరుకుందాం. - కోన సుధాకర్‌రెడ్డి


