లోకల్‌ టాలెంట్‌ కాదు అమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌ | Rajasthan boy stuns Americas Got Talent audience | Sakshi
Sakshi News home page

లోకల్‌ టాలెంట్‌ కాదు అమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌

Jul 14 2024 6:35 AM | Updated on Jul 14 2024 6:35 AM

 Rajasthan boy stuns Americas Got Talent audience

వైరల్‌ 

కాళ్ల కింద రెండు గ్లాసులు, తల మీద గ్లాస్‌పై గ్లాస్‌ పద్దెనిమిది గ్లాస్‌లు పెట్టుకొని వాటిపై కుండ పెట్టుకొని రెండడుగులు వేయడమే కష్టం. అలాంటిది డ్యాన్స్‌ చేయడం అంటే మాటలు కాదు కదా! రాజస్థాన్‌కు చెందిన ప్రవీణ్‌ ప్రజాపత్‌ నిన్న మొన్నటి వరకు లోకల్‌ టాలెంట్‌. ఇప్పుడు మాత్రం అమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌.  

ఫోక్‌ డ్యాన్సర్‌ అయిన ప్రవీణ్‌కు అమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌ (ఏజీటి)లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకొని ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’ అందుకున్నాడు. కాళ్ల కింద 2 గ్లాసులు(డ్యాన్స్‌ ప్రారంభంలో) తల మీద 18 గ్లాస్‌లు వాటిపై ఒక కుండతో ప్రవీణ్‌ చేసిన ‘మట్కా భవ’ డ్యాన్స్‌ ఆడిటోరియంను ఉర్రూతలూగించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్‌ చేసిన ఈ వీడియో వైరల్‌ అయింది.

Advertisement
 
Advertisement
Advertisement