యూట్యూబ్‌ రీడిజైన్‌ హోంపేజీ | YouTube has refreshed its homepage with a simpler top bar | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌ రీడిజైన్‌ హోంపేజీ

Oct 31 2026 5:00 AM | Updated on Oct 31 2026 5:00 AM

YouTube has refreshed its homepage with a simpler top bar

టెక్‌ టాక్‌

యూజర్‌లు తమకు నచ్చిన కంటెంట్‌ను మరింత త్వరగా వీక్షించే లక్ష్యంతో యూట్యూబ్‌ సరికొత్త హోంపేజీని ప్రారంభించింది. రీడిజైన్‌ చేసిన హోంపేజీలో అనేక విభాగాలను సులభంగా అందుబాటులో ఉంచే క్రమబద్దమైన టాప్‌ బార్‌ ఉంటుంది. యూజర్‌లు తమ సబ్‌స్క్రిప్షన్‌తో నేరుగా మూవీస్‌ అండ్‌ టీవి, లైవ్‌ అండ్‌ మ్యూజిక్‌ విభాగాలలోకి వెళ్లవచ్చు. కస్టమ్‌ ఫీడ్‌లకు కూడా ఈ బార్‌ యాక్సెస్‌ ఇస్తుంది.

విభాగాలన్నింటినీ ఒకేచోట చేర్చడం వల్ల యూజర్‌లు తమకు కావాల్సిన నిర్దిష్ట కంటెంట్‌ కోసం మెనూలో వెదకాల్సిన పని ఉండదు. కస్టమ్‌ఫీడ్‌లు పర్సనలైజ్‌డ్‌ సేవ్‌డ్‌ సెర్చ్‌ వలే పనిచేస్తాయి. స్పెస్పిక్‌ సెర్చ్‌ టర్మ్‌ను టైప్‌ చేయడానికి బదులుగా, తామ కోరుకునే కంటెంట్‌ రకాన్ని, తమకు ఆసక్తి ఉన్న అంశాన్ని, మానసిక స్థితిని (జనరల్‌ మూడ్‌), ‘వైబ్‌’ను కూడా వివరించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే... సంబంధిత వీడియోలను కనుగొనడానికి యూజర్‌లకు ఖచ్చితమైన కీవర్డ్స్‌ తెలియాల్సిన అవసరం లేదు.

→ ముందుగా తయారుచేసిన టాపిక్‌చిప్‌లపై ట్యాప్‌ చేయడానికి బదులుగా, హోంపేజీ పై భాగంలో ఉన్న ‘ప్లస్‌’ బటన్‌ ట్యాప్‌ చేసి మీరు ఏమి చూడాలనుకుంటున్నారో టైప్‌ చేయవచ్చు. 

→ ఫ్రీ యూజర్‌లు ఒకేసారి మూడు కస్టమ్స్‌ ఫీడ్‌ వరకు సేవ్‌ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లు ఎనిమిది వరకు సేవ్‌ చేసుకోవచ్చు. ఈ ఫీడ్స్‌ను కావాల్సివచ్చినప్పుడు ఎడిట్‌ చేయవచ్చు, తొలిగించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement