వ్యాపారంలో ఎదురు దెబ్బలు తగలగానే మనకు ఇది సూట్ కాదని వదిలేస్తాం. కొందరు వైఫల్యం, ఎదురుదెబ్బల్ని..గొప్ప సక్సెస్‌ని అందించే పాఠాలుగా తీసుకుంటారు. అలా సానూకూల దృక్పథంతో ముందుకు సాగి ఆహార వ్యాపారంలో లక్షల్లో డబ్బుని ఆర్జిస్తూ శెభాష్ అనిపించుకుంటున్నాడు ఈ యువకుడు.
అతడే అభిషేక్ సాహు. ఈ యువకుడు వైఫల్యాన్ని వ్యాపార ప్రస్థానానికి ముగింపు కాదని నమ్మాడు. చివరికి అతడి నమ్మకమే నిజమైంది. నిజానికి సాహు 15 ఏళ్ల క్రితం భోపాల్ వెళ్లి ఇంటర్నెట్ కేఫ్‌ని ప్రారంభించాడు. అయితే ఆ వ్యాపారం ఏడాదిలోపే మూతపడింది. అయితే సాహు వ్యాపారం తన వల్ల కాదని అగిపోకోకుండా మరో వ్యాపార ప్రయత్నం ప్రారంభించాడు. మరోసారి తన అదృష్టం పరీక్షించుకోవాలన్న కృత నిశ్చయంతో ఈ సారి రూ. 30 వే పెట్టుబడితో చిన్న శాండ్‌విచ్ బండిని ప్రారంభించాడు.
నిజానికి ఆహార వ్యాపారంలో అనుభవము లేదు ..ఆ వంటకం తయారీ కూడా రాదు. అయితే సాహు యూట్యూబ్ సాయంతో శాండ్ విచ్ తయారీల గురించి తెలుసుకుని మరి ఈ వ్యాపారం ప్రారంభించాడు. హరిహర్ శాండ్‌విచ్ అనే పేరుతో బిజినెస్ ప్రారంభించాడు. క్రమంగా పుంజుకుంటూ లాభాల బాట పట్టడం మొదలైంది. ఇవాళ ఆ వ్యాపారం వారాపు రోజుల్లో దాదాపు 600 శాండ్‌విచ్‌లు అమ్ముతుండగా, వారాంతాల్లో ఏకంగా వెయ్యికి పైగా శాండ్‌విచ్‌లు అమ్ముడవ్వడం విశేషం.
ఈ వ్యాపారం నెలకు సుమారు రూ. 25 లక్షలు టర్నోవర్ ఆర్జిస్తోంది. విఫలమైన ఇంటర్నెట్ కేఫ్ నుంచి ఏకంగా రూ. 25 లక్షలు ఆర్జించే స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం నడిపే రేంజ్‌కి అంటే ఇది నిజంగా స్ఫూర్తిదాయకమైన విజయం కదూ. అయోధ్య బైపాస్ రోడ్డులోని మినాల్ రెసిడెన్సీ వద్ద ఉన్న ఈ పిజ్జా బండి వద్దకు పెద్ద సంఖ్యలో జనాలు వస్తుంటారు.
సందర్శకులు కనీసం 30 నుంచి 50 నిమిషాలు వెచ్చించి మరి వాటి రుచి కోసం వెయిట్ చేస్తుంటారంటే..ఎంతగా సాహు వ్యాపారం పేరుగాంచిందో తెలుస్తోంది కదూ. అంతేగాదు అతని సోదరుడు దీపక్ సాహు కూడా ఈ వ్యాపారంలో సాయం అందిస్తుంటాడట. ఈ ప్రేరణాత్మక స్టోరీని ప్రథమ్ అనే యూజర్ సోషల్ మీడియా వేదకగా షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది.
This is Abhishek Sahu.
15 years ago, he moved to Bhopal and started an internet café. It shut down within a year.
He then took a ₹30,000 loan and started a small sandwich cart after learning recipes on YouTube.
Today, Hari Har Sandwich sells:
⁰• 600+ sandwiches on weekdays… pic.twitter.com/mwjGaaChuU— Pratham (@CapitalLens_) September 1, 2026
(చదవండి: అర ఎకరం..ఏడాదికి రూ. 80 లక్షలు!)


