గుండెజబ్బులను గుర్తించేందుకు మరో ఆయుధం | Iron transporting protein may enable early heart disease detection | Sakshi
Sakshi News home page

గుండెజబ్బులను గుర్తించేందుకు మరో ఆయుధం

Sep 10 2026 6:32 PM | Updated on Sep 10 2026 6:47 PM

Iron transporting protein may enable early heart disease detection

న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (IGIB) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో, కోరోనరీ ఆర్టరీ డిసీజ్ (CAD)ని ముందస్తుగా గుర్తించడంలో సెరోట్రాన్స్‌ఫెరిన్ (Serotransferrin - TF) అనే ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుందని తేలింది. శరీరం మొత్తానికి ఐరన్‌ సరఫరా చేసేందుకు ఉపయోగపడే సెరోట్రాన్స్‌ఫెరిన్‌ అనే ప్రొటీన్‌ తక్కువగా ఉంటే కరోనా ఆర్టరీ డిసీజ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఐజీఐబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. రక్తనాళాల్లో గార లాంటి పదార్థం పేరుకుపోవడం వల్ల గుండెకు రక్త ప్రసారం తగ్గడాన్నే కరోనా ఆర్టరీ డిసీజ్‌ అంటారు. అయితే ఈ సమస్యకు గురైన వారిలో ఐరన్‌ తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ జబ్బును ముందుగానే గుర్తించడం కష్టం. ఈ నేపథ్యంలో సెరోట్రాన్స్‌ఫెరిన్‌ మోతాదులను పరిశీలించడం ద్వారా ఒక వ్యక్తి కరోనా ఆర్టరీ డిసీజ్‌కు గురయ్యే అవకాశం ఎంత ఉందో ముందుగానే తెలుసుకోవచ్చు నని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త సాగరికా బిశ్వాస్‌ తెలిపారు. 

సెరోట్రాన్స్‌ఫెరిన్‌ పనితీరును క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం ద్వారా గుండెజబ్బులకు కొత్త చికిత్సలు అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్న వారితో పోలిస్తే గుండెజబ్బు ఉన్న వారిలో మొత్తం 197 ప్రొటీన్లలో ఒక్క సెరోట్రాన్స్‌ఫెరిన్‌ మాత్రమే తక్కువగా ఉన్నట్లు తమ పరిశీలనలో తెలిసిందని ‘ఆక్టా కార్డియోలాజికా’జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం తెలిపింది. గుండెజబ్బులున్న వారు యాభై మందిని, ఆరోగ్యంగా ఉన్న 40 మందిని పరిశీలించినప్పుడు జబ్బులున్న వారిలో ‘ట్రోపోనిన్‌–1’ఎక్కువగా ఉన్నట్లు కూడా ఈ పరిశోధన ద్వారా తెలిసిందని శాస్త్రవేత్తలు చెప్పారు. 

ఇదీ చదవండి: ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా : కేంద్రమంత్రి గడ్కరీ ధ్వజం

రాబోయే రోజుల్లో సెరోట్రాన్స్‌ఫెరిన్‌పై మరిన్ని మాలిక్యులర్, క్లినికల్ పరిశోధనలు జరిగితే, ఇది గుండె జబ్బుల నివారణ మరియు చికిత్సలో ఒక కొత్త మార్గాన్ని సుగమం చేస్తుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు. గుండె కండరాల్లో ఉండే ఈ ప్రత్యేక ప్రొటీన్‌ ఏదైనా నష్టం, గాయమైనప్పుడు రక్తంలోకి చేరుతూంటుంది. ఇది ఎక్కువగా ఉంటే గుండెజబ్బు ఉన్నట్లు లెక్క. అలాగే సెరోట్రాన్స్‌ఫెరిన్‌ తక్కువగా ఉన్నా జబ్బు ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు.   

ఇదీ చదవండి: మిన్ను విరిగి మీద పడినా : పెళ్లి ఆగేదే లేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement