సాక్షి, ముంబై: పూణేలోని శనివార్ పేట్ ప్రాంతంలో విషాదంచోటు చేసుకుంది. కేవలం రూ. 2.5 లక్షల అప్పు తీర్చలేక సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న 28 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలో తన అప్పులపై రాసిన రెండు పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం మృతుడిని ధారాశివ్ జిల్లాలోని పరందా తహసీల్ పరిధిలోని ఖసాపురి గ్రామానికి చెందిన ప్రథమేష్ దేశ్‌ముఖ్‌గా గుర్తించారు. గత ఎనిమిది నెలలుగా పూణేలోని ఒక భవనంలో మూడవ అంతస్తులో ఉన్న వన్-BHK ఫ్లాట్‌లో ఇతర విద్యార్థులతో కలిసి ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) పరీక్షలతో సహా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు.బుధవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు దేశ్‌ముఖ్ రాసినట్లు భావిస్తున్న లేఖ సూచిస్తోందని విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ నవనాథ్ జగ్‌తాప్ తెలిపారు.
MPSC ची तयारी करणाऱ्या परांडा तालुक्यातील (जि. धाराशिव) विद्यार्थी प्रथमेश देशमुख याने पुण्यात आत्महत्या केल्याची घटना अत्यंत दुःखद आहे.
गेल्या काही काळात पेपरफुटीसह विविध गैरप्रकार होत असल्याने एक स्वप्न उराशी बाळगून अभ्यास करणाऱ्या विद्यार्थ्यांमध्ये डावलल्याची भावना निर्माण… pic.twitter.com/UWiw9vcyVQ— Riven (@R1v3n_0x) September 9, 2026
ఇదీ చదవండి: కేవలం రూ.15 కోసం ప్రొఫెసర్‌పై కత్తితో దాడి
సొంత ఖర్చుల కోసం దేశ్‌ముఖ్ రూ. 2.5 లక్షలు అప్పు తీసుకున్నానని, అందులో అతను ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నాడో వారి పేర్లను కూడా అందులో పేర్కొన్నాడు. అతను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎందుకు అప్పు చేయాల్సి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని, తల్లిదండ్రులను కూడా విచారించనున్నామని డీసీపీ (జోన్-1) రుషికేష్ రావలే చెప్పారు.
మరోవైపు మార్చిలో జరిగిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ (గ్రూప్-బి) స్క్రీనింగ్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలతో సహా, నియామక పరీక్షలలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై పూణే , మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో MPSC అభ్యర్థులు నిరసనలు తెలుపుతున్న తరుణంలోనే అతని బలవన్మరణం పలు ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది.

An MPSC aspirant died by suicide. Exam delays, irregularities and years of uncertainty have made the pressure unbearable for many students.
How many more students have to suffer before the government takes accountability?https://t.co/SbWkzoej5h— Cockroach Janta Party - CJP (@Cockroachisback) September 9, 2026
ఇంకా ఎంతమంది బలికావాలి - సీజేపీ
మరోవైపు ఈ ఘటనపై సీజేపీ కూడా స్పందించింది. పరీక్షల ఆలస్యం, అక్రమాలు , సంవత్సరాల అనిశ్చితి ఒత్తిడి చాలా మంది విద్యార్థులను బలితీసుకుంటోంది. ఇంకా ఎంతమంది బలికావాలి? ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేసింది. బాధిత కుటుంబాన్ని కలుసుకున్న సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే వారిని ఓదార్చారు.
ఇదీ చదవండి: 'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్‌ఐఆర్ నోటీసు


