ఒడిశా : జయపురం సబ్ కలెక్టర్‌గా శుభ్ర పండా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ బాధ్యతల్లో ఉన్న జాదుమణి నాయిక్‌ను బదిలీ చేసి ఆమె స్థానంలో శుభ్ర పండాను నియమించారు. కొత్త సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జయపురం మునిసిపాలిటీ కార్యనిర్వాహక అధికారి (ఈఓ) బాధ్యతలను కూడా అదనంగా అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
జయపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో పరిపాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలో సబ్ కలెక్టర్ కీలక పాత్ర పోషిస్తారు. మునిసిపాలిటీ ఈఓ బాధ్యతలు కూడా అప్పగిస్తే పట్టణ పరిపాలనకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న జాదుమణి నాయిక్‌కు తదుపరి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆమె బదిలీకి సంబంధించిన తదుపరి నియామక వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
చదవండి: ఒకే జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ దంపతులు


