ప్రీమియం ఫోన్ మేకర్ యాపిల్ తన కొత్త ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్లను అధికారికంగా విడుదల చేసింది. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పేరుతో వచ్చిన ఈ రెండు మోడళ్లలో కెమెరా, పనితీరు, బ్యాటరీ, ఏఐ సామర్థ్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది.
భారత్‌లో సెప్టెంబర్ 12న సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమై, సెప్టెంబర్ 18 నుంచి విక్రయాలు మొదలవుతాయి.
ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో అతిపెద్ద అప్‌గ్రేడ్ కెమెరా విభాగంలో కనిపిస్తుంది. 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ మెయిన్ కెమెరాకు తొలిసారిగా ‘మెకానికల్ వేరియబుల్ అపెర్చర్’ను యాపిల్ తీసుకొచ్చింది.
ఐఫోన్ 18 ప్రో 256GB వేరియంట్ రూ.1,64,900 నుంచి ప్రారంభమవుతుంది. 512GB ధర రూ.1,89,900, 1TB ధర రూ.2,39,900, 2TB ధర రూ.3,14,900.
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 256GB ధర రూ.1,79,900. 512GB రూ.2,04,900, 1TB రూ.2,54,900, 2TB రూ.3,29,900గా ఉన్నాయి.
Images Source : : Twitter (X)


