హైదరాబాద్ : మాదాపూర్ హైటెక్స్‌లో గురువారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ మెషిన్ టూల్ అండ్ ఇంజనీరింగ్ ఎగ్జిబిషన్ (హిమ్‌టెక్స్) ప్రారంభమైంది.
ఈ ప్రదర్శననను ఏస్ ఆర్బన్ గ్రూప్ డైరెక్టర్ డైరెక్టర్ స్వాతి చలమలశెట్టి, ఎంఎస్‌ఎంఈ అదనపు డైరెక్టర్ డీఎఫ్‌ఓ రాజేశ్‌కుమార్ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా 300 సంస్థలు పాల్గొంటున్నాయి.
మెషీన్‌టూల్స్, రోబోటిక్స్, ఇంజనీరింగ్ సొల్యూషన్స్, ఇండస్ట్రీయల్ ఆటోమెషన్ రంగాల్లోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ప్రదర్శించనున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణతో పాటు పొరుగురాష్ట్రాల్లో తయారీరంగ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు.


