‘ఆమ్‌ ఆద్మీ’కి షాక్‌: కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్ | Priyanka Kakkar joined Congress | Sakshi
Sakshi News home page

‘ఆమ్‌ ఆద్మీ’కి షాక్‌: కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్

Oct 3 2026 1:48 PM | Updated on Oct 3 2026 2:13 PM

Priyanka Kakkar joined Congress

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)ప్రధాన జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు రాజీవ్ శుక్లా, పవన్ ఖేడా, దేవేందర్ యాదవ్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే శ్యామ్ సుందర్ శర్మ, రజత్ రాకేశ్ టండన్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ, తాను చిన్నప్పటి నుంచి చూసిన పరిశుభ్రమైన, పచ్చని, సురక్షితమైన ఢిల్లీని మళ్లీ కాంగ్రెస్ మాత్రమే తీసుకురాగలదని, రాజకీయాల్లో నిజాయితీగా నిలబడే ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమే అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆప్ తన మూల సిద్ధాంతాల నుంచి తప్పుకుందని, బంగ్లాలు, కార్లు వద్దన్నవారే ఇప్పుడు వ్యక్తిగత ప్రయాణాలకు చాపర్లు వాడుతున్నారని, పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కనపెట్టి కొత్తవారికి పెద్ద పదవులు కట్టబెడుతున్నారని ఆమె తీవ్రస్థాయిలో ఆరోపించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement