అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి | America Ohio Hindu Temple Attack Over Hate Crime | Sakshi
Sakshi News home page

అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి

Oct 3 2026 11:07 AM | Updated on Oct 3 2026 11:13 AM

America Ohio Hindu Temple Attack Over Hate Crime

ఒహాయో: అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో ఒక హిందూ దేవాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. రిచ్‌మండ్ హైట్స్ ప్రాంతంలోని శ్రీ స్వామినారాయణ్ వడ్తాల్ ధామ్ హిందూ ఆలయంపై దుండగులు ఇటుకలు విసరడంతో ఆలయం కిటికీలు, తలుపులు, అద్దాలు పగిలి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ దాడిని హిందూ అమెరికన్ ఫౌండేషన్ తీవ్రంగా ఖండించింది.
 

రంగంలోకి ఎఫ్‌బీఐ విభాగం
ఈ ఘటనకు సంబంధించిన సర్వైలెన్స్ (సీసీటీవీ) వీడియో ఆధారంగా దర్యాప్తు అధికారులు విచారణ చేపట్టారు. ఈ దాడికి సంబంధించిన సమగ్ర వివరాలను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)కి చెందిన సివిల్ రైట్స్ యూనిట్‌‌కు కూడా అందించినట్లు అధికారులు తెలిపారు. ఆలయ నిర్వాహకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి అన్ని రకాల న్యాయ, సహాయ సహకారాలు అందిస్తున్నామని సంస్థ స్పష్టం చేసింది.

నిందితుల అరెస్ట్‌కు డిమాండ్
ఈ దాడిని విద్వేషపూరిత నేరం (హేట్ క్రైమ్)గా పరిగణించి, నిందితులను తక్షణమే పట్టుకోవాలని హిందూ అమెరికన్ ఫౌండేషన్ దర్యాప్తు సంస్థలను డిమాండ్ చేసింది. అమెరికాలో ఇటీవల హిందూ అమెరికన్ సమాజంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు, విద్వేషం పెరుగుతున్నదని పేర్కొంది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఏజెన్సీలు భారతీయ, హిందూ సమాజాలపై జరుగుతున్న ద్వేషపూరిత దాడులను బహిరంగంగా ఖండించాలని కోరింది. మహాత్మా గాంధీ జయంతి రోజే, ఒహాయోలో అధికారికంగా ప్రకటించిన ‘హిందూ హెరిటేజ్ మంత్’ ప్రారంభమైన రోజే ఈ దాడి జరగడం గమనార్హం.

ఇదీ చదవండి: 24 గంటల్లో రెండు ఎన్‌కౌంటర్లు.. నిందితులకు గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement