చికిత్సకు తెచ్చిన తోపుడు బండిపైనే మృతదేహాన్ని తోసుకుంటూ.. | Family Carries Dead body on Handcart after no Ambulance | Sakshi
Sakshi News home page

చికిత్సకు తెచ్చిన తోపుడు బండిపైనే మృతదేహాన్ని తోసుకుంటూ..

Oct 3 2026 8:41 AM | Updated on Oct 3 2026 8:41 AM

Family Carries Dead body on Handcart after no Ambulance

వైశాలి: దేశంలోని ప్రభుత్వ వైద్యవ్యవస్థ తీరుతెన్నులు ఎలా ఉన్నాయో చూపే ఒక ఘటన ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. బీహార్‌లోని వైశాలిలో ఈ హృదయవిదారక ఉదంతం చోటుచేసుకుంది. లాల్‌గంజ్‌లో 31 ఏళ్ల మోను కుమార్ ఆస్పత్రిలో మరణించిన తర్వాత, అతని మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ లేదా శవవాహనం (మార్చురీ వ్యాన్) అందుబాటులో లేదు. దీంతో  కుటుంబ సభ్యులు మోనును చికిత్స కోసం ఏ తోపుడు బండిపై ఆస్పత్రికి తీసుకొచ్చారో, చివరకు అదే ట్రాలీపై అతని మృతదేహాన్ని ఉంచి, ఇంటికి తీసుకెళ్లాల్సిన దుస్థితి ఎదురైంది. వైశాలిలో వెలుగుచూసిన ఈ ఘటన ప్రభుత్వ వైద్య వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తిచూపింది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియోను చూసినవారంతా ప్రభుత్వ వైద్య వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: Turkey: కూలిన బొగ్గు గని.. ఐదుగురు కార్మికులు దుర్మరణం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement