ఇటీవలి కాలంలో బీహార్‌లో వరుసగా వెలుగులోకి వస్తున్న మహిళలు, బాలికలపై వేధింపుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒక ఘటన మరవకముందే మరో వీడియో బయటపడుతోంది. తాజాగా బంకా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మందార్ హిల్‌లో ఓ మహిళను కొందరు యువకులు వేధించి, చెప్పుతో కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఆరుగురు గుర్తుతెలియని యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. వైరల్ వీడియోలో కొందరు యువకులు యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ కనిపించారు. అంతటితో ఆగకుండా ఆమెపై చెప్పుతో దాడి చేశారు. వీడియోలో కనిపిస్తున్న టైమ్‌స్టాంప్ ప్రకారం ఈ ఘటన సెప్టెంబర్ 3న జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ దృశ్యాలు సెప్టెంబర్ 22న పోలీసుల సోషల్ మీడియా సెల్ దృష్టికి వచ్చాయి. వీడియోను పరిశీలించిన పోలీసులు వెంటనే మందార్ హిల్‌కు చేరుకున్నారు. వీడియోలో కనిపిస్తున్న ప్రాంతం ఇదేనా అని పరిశీలించి.. ఘటన జరిగిన ప్రదేశాన్ని నిర్ధారించారు. అనంతరం అక్కడి స్థానికులు, దుకాణదారులను విచారిస్తూ వీడియోలో కనిపిస్తున్న యువకులు, మహిళ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.
Jungle Raj is back in Bihar; first Jamui, then Samastipur, now Banka; cases of molestation of daughters of Bihar are not stopping.
This is a video from Mandar Mountain in Banka, Bihar, where some men are molesting a woman.
Honorable Chief Minister Mr. Samrat Chaudhary, you talk… pic.twitter.com/e7HrvwRJIi— Wallah Habebe (@Wallahhabebe) September 25, 2026
సుమోటోగా కేసు..
బాధితురాలి నుంచి ఫిర్యాదు అందకపోయినా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. మహిళపై దాడి, వేధింపులకు సంబంధించిన BNS సెక్షన్లు 74, 75, 76, 3(5)తో పాటు ఐటీ చట్టంలోని 66E, 67A సెక్షన్ల కింద కేసు నమోదైంది. వైరల్ వీడియోను ఆధారంగా నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
🚨SAMASTIPUR HORROR | After Jamui, another video of a similar incident has surfaced from Samastipur, showing a teenage girl being harassed by a group of men pic.twitter.com/GZf0bjC3YK
— The Tatva (@thetatvaindia) September 24, 2026
వరుస ఘటనలతో కలకలం..
ఇటీవలే బీహార్‌లోని జమూయిలో కోచింగ్ నుంచి తిరిగి వస్తున్న బాలుడు, బాలికను కొందరు అడ్డుకుని వేధించిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు ఆమె స్నేహితుడిపై దాడి చేసిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. సెప్టెంబర్ 19న జరిగిన ఈ ఘటనలో ప్రధాన నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పట్టుకునే సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరూ గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు కనీసం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇలా ఒక ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగానే మరో వేధింపుల ఘటన వెలుగులోకి వస్తుండటంతో బీహార్‌లో కలకలం కొనసాగుతోంది. వేధింపుల కారణంగా బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మహిళల భద్రతపై ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రశ్నలు సంధిస్తున్నాయి.
Salute to this Class 10 boy. He could have run away to save himself, but instead he stayed and stood between the girl and the attackers, even while being beaten and slapped. His courage and presence of mind may have prevented an even worse assault.
Huge respect to him. Real… pic.twitter.com/DxUt1IfoTs— Cric Uneeb (@Cric_Uneeb) September 22, 2026
A couple in Jamui, Bihar, was allegedly harassed by a group of men, and the girl was reportedly at risk of being sexually assaulted.
Why do some people think they have the right to harass couples simply because they are together?
Being a couple is not a crime. No one has the… pic.twitter.com/uCZBhu06Ab— Aradhya (@ItsAradhya__) September 21, 2026


