అత్యున్నత అధికారిగా దేశ సేవలందించిన ఆమె అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. తనకు విరామం కావాలంటూ నచ్చిన అభిరుచి వైపుగా సాగిపోతోంది. పైగా అందరూ అంత పెద్ద హోదాలో సాగి ఇలా ఈ వ్యాపారం ఏంటి అని అడిగితే ఆమె ఇచ్చే సమాధానం ఆలోచింప చేసేలా కాదు, కుటుంబ విలువలను గుర్తు చేస్తోంది. ఎవరా మహిళా అంటే..
ఆ అధికారిణే రాధికా ఆనంద్. ఆమె ఆర్మీలో మాజీ భారత వైమానిక దళ(ఐఏఎఫ్) అధికారిణి. సైనిక వృత్తిని విడిచిపెట్టి బొటిక్ వ్యాపారం ప్రారంభించన తన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తాను కేవలం కుటుంబానికి దగ్గరగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొది. తన కస్టమర్లలో చాలామంది వైమానిక దళ అధికారిణిగా ఇలా స్టైలిష్ దుస్తుల బ్రాండ్ బొటిక్‌ని ఎలా రన్ చేస్తున్నారని అడుగుతుంటారని చెప్పుకొచ్చింది.
తాను 14 ఏళ్ల షార్ట్ సర్వీస్ కమిషన్‌ను పూర్తి చేసిన తర్వాత సైన్యం నుంచి నిష్క్రమించడం అనేది అత్యంత సర్వసాధారణమని అన్నారామె. తన సర్వీస్ ముగిసిన తర్వాతే దీన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన వైమానిక దళం వృత్తి నుంచి తప్పుకోవడానికి కేవలం పిల్లలతో గడపాలని, కుటుంబంతో టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే తప్ప పెద్ద రీజన్ అంటూ ఏమి లేదని తేల్చి చెప్పింది.
తన సొంతూరు డెహ్రూడూన్‌లో తన కలల జీవితాన్ని నిర్మించుకోవాలనే ఉద్దేశ్యంతోనే బోటిక్‌ని పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తన ఇల్లు సొంతూరికి కేవలం వంద కిలోమీటలర్ల దూరంలోనే ఉందని పేర్కొంది. తనను ఎంతాగానో ప్రేమించే తల్లిదండ్రలకు, పిల్లలకు అందుబాటులో ఉండాలనే ఇలా చేశానని వెల్లడించింది.
అంతేగాదు తాను పిల్లలతో ఉండాలనుకునే తల్లిని అంటూ సంభాషణను ముగించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలి మేడమ్. ఐనా మన వాళ్లతో గడిపే క్షణాలను డబ్బుతో కొలవలేమంటూ భావోద్వేగంగా పోస్టులు పెట్టారు.
ఇదీ చదవండి: snow Ganesha: శాస్త్రవేత్తల గణేశుడి పండుగ..! నిమజ్జనం ఎలా చేశారంటే..)


