ఎట్టకేలకు 59 ఏళ్ల వయసులో టీచర్‌ ఉద్యోగం..! | UP Man Finally Gets Government Teacher Job At 59 | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు 59 ఏళ్ల వయసులో టీచర్‌ ఉద్యోగం..! ఏకంగా 27 ప్రయత్నాల తర్వాత..

Sep 25 2026 5:17 PM | Updated on Sep 25 2026 5:37 PM

UP Man Finally Gets Government Teacher Job At 59

ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలామంది యువత డ్రీమ్‌. కానీ ఆ వ్యక్తిలా ఇంతలా ఇన్నిసార్లు ప్రయత్నించి ఉండరు. ఎందుకంటే..ఎవ్వరైనా మహా అయితే ఓ పదిసార్లు ట్రై చేసి ఆగిపోతారామె. కానీ ఇతడు పట్టువదలని విక్రమార్కుడిలా చేసిన ప్రయత్నం నిజంగా స్ఫూర్తిదాయకం. ఓపికకు చిరునామా కూడా. 

అతడే ఉత్తరప్రదేశ్‌కి చెందిన విజయ్‌ కుమార్‌ శర్మ. దాదాపు 27 ప్రయత్నాల తర్వాత ప్రభుత్వ ఉపాద్యాయుడిగా ఉద్యోగం సాధించారు. 1999 నుంచి నియమాక పరీక్షలకు హాజరవుతూ వచ్చిన 59 ఏళ్ల శర్మ సంస్కృత విభాగంలో 'ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్' (TGT)గా ఎంపికయ్యారు. ఆయన అనేకసార్లు రాత పరీక్షలో ఉత్తీర్ణులైనప్పటికీ ఇంటర్యూలో ఫెయిలవ్వడంతో ఉద్యోగం పొందలేకపోయినట్లు తెలిపారు. 

ఈసారి నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూని తొలగించడంతో తాను ఎంపికైనట్లు వెల్లడించారు శర్మ. ఏళ్ల తరబడి రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించనప్పటికీ, కేవలం ఇంటర్వ్యూలో వైఫల్యం చెందడం వల్లే ఉద్యోగం సాధించలేకపోయినట్లు తెలిపారు. ఆయన టీజీటీ నియామకానికి ఆరుసార్లు, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ టీచర్‌ నియమాకానికి నాలుగుసార్లు రాతపరీక్షలలో ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఆయన 26 ఏళ్ల పాటు 'డూన్ పబ్లిక్ స్కూల్'లో ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. పాఠశాలలో బోధిస్తూనే ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు సన్నద్ధమైనట్లు పేర్కొన్నారు. 

అంతేగాదు ఆ ప్రైవేట్‌ పాఠశాల డైరెక్టర్‌ మాట్లాడుతూ.. శర్మ 2003 నుంచి తమ సంస్థతో అనుబంధ కలిగి ఉన్నారని, రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడ బోధించారని చెప్పారు. ఆయన పాఠాలు బోధిస్తూనే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారని పేర్కొన్నారు. విచిత్రం ఏంటంటే శర్మ తండ్రి లక్ష్మణ్‌ సింగ్‌ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే. ఇక ఆయనకు ఐదుగురు పిల్లలు, వీరిలో ఇద్దరు కుమారులు ఉత్తప్రదేశ్‌ పోలీస్‌ విభాగంలో పనిచేస్తుండగా, ముగ్గురు కుమార్తెలు  ఉన్నారు. వారిలో ఒకరు ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికై పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. 

ఇక తన నియమాకం గురించి శర్మ మాట్లాడుతూ..ఎట్టకేలకు ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకోవడం తన జీవితంలోని అత్యంత గొప్ప విషయమని అన్నారు. తన ప్రతి ప్రయత్నంలో తప్పులను సరిదిద్దుకుంటూ పనితీరుని మెరుగుపరుచుకున్నాని అన్నారు. అంతేగాదు పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. 

కాగా శర్మ సెప్టెంబర్ 22న లక్నోలోని ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా తన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఆయన షామ్లీ జిల్లాలోని ఒక ఎయిడెడ్ మాధ్యమిక పాఠశాలలో టీజీటీ(TGT) సంస్కృత ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు.

ఇదీ చదవండి: ఎలక్ట్రీషియన్‌ నుంచి మాస్టర్‌ చెఫ్ విజేత, రెస్టారెంట్‌ యజమాని రేంజ్‌కి..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement