సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై సుప్రీంలో పిల్‌ | Plea In Supreme Court Seeks Prosecution on Gyanesh Kumar | Sakshi
Sakshi News home page

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై సుప్రీంలో పిల్‌

Sep 25 2026 3:21 PM | Updated on Sep 25 2026 3:46 PM

Plea In Supreme Court Seeks Prosecution on Gyanesh Kumar

ఢిల్లీ: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై విచారణ జరపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎస్‌ఐఆర్‌లో అవకతవకలు, ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడ్డారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏకపక్షంగా ఫారం 6లో మార్పులను ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వ్యతిరేకించిన నేపథ్యంలో విచారణ జరపాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాల వల్ల అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయారని పిటిషనర్‌ పేర్కొన్నారు.

మరోవైపు, జ్ఞానేశ్‌ కుమార్‌ను బాధ్యతల నుంచి తొలగించేందుకు లోక్‌సభ, రాజ్యసభలో తీర్మానం చేయాలని కోరుతూ త్వరలోనే ప్రతిపక్షాలు మరోసారి నోటీసు ఇవ్వనున్నట్లు సమాచారం. జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న మూడో ప్రయత్నమిది కావడం గమనార్హం. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని రూపొందించే ఈ నోటీసును వచ్చే వారం పార్లమెంట్‌ ఉభ య సభల్లో అందజేసే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇద్దరు కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ప్రచురించిన పరిశోధనాత్మక కథనం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. గత పది నెలల కాలంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, వివేక్‌జోషీలు మొత్తం 14 సార్లు వివిధ నిర్ణయాలపై తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా వ్యక్తం చేశారని, అనధికారిక, అక్రమ ఉత్తర్వులంటూ తెలిపినప్పటికీ ఆ నిర్ణయాలు అమలయ్యాయని ఈ కథనం ఆరోపించింది.

ఇదీ చదవండి: ఇంకా 24 గంటలే.. సీఈసీ జ్ఞానేశ్‌కు కాక్రోచ్‌ల డెడ్‌లైన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement