వెస్టిండీస్‌ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు | Hayley Matthews Creates World Record In ODI Match Vs Zimbabwe | Sakshi
Sakshi News home page

WI vs ZIM: వెస్టిండీస్‌ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు

Sep 24 2026 9:25 PM | Updated on Sep 24 2026 9:26 PM

Hayley Matthews Creates World Record In ODI Match Vs Zimbabwe

విధ్వంసకర సెంచరీతో చెలరేగింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన మాథ్యూస్‌.. జింబాబ్వే బౌలర్లను ఉతికారేసింది. కేవలం 15 బంతుల్లో 26 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 182 పరుగులు చేసి తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకుంది. ఫలితంగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది.

అనంతరం ఈ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 43.3 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. దీంతో 99 పరుగుల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. జింబాబ్వే బ్యాటర్లలో మోడెస్టర్ ముపాచిక్వా టాప్ స్కోరర్‌గా నిలవగా.. విండీస్ బౌలర్లలో ఆలియా అల్లెన్ మూడు, అశ్మిని మునిసార్, ఫ్లెచర్ తలా రెండు వికెట్లు పడగొట్టింది.

ఇక ఈ మ్యాచ్‌లో భారీ సెంచరీతో చెలరేగిన మాథ్యూస్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. వెస్టిండీస్ మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు బ్యాటర్‌గా ఆమె  చరిత్రకెక్కింది. ఇంతకుముందు ఈ దిగ్గజ ఆల్‌రౌండర్ స్టెఫానీ టేలర్ (171) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో ఆ రికార్డును హేలీ మాథ్యూస్ అధిగమించింది.

అదేవిధంగా వన్డేల్లో ఒకే క్యాలెండర్ ఈయర్‌లో రెండుసార్లు 150కి పైగా పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా హేలీ మాథ్యూస్ నిలిచారు. ఇదే ఏడాది మేలో ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో కూడా మాథ్యూస్ 159 పరుగులు పరుగులు చేసింది. ఇక ఓవరాల్‌గా మహిళా వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు నమోదు చేసిన జాబితాలో మాథ్యూస్ ఐదో స్ధానంలో నిలిచింది. ఈ లిస్ట్‌లో అమేలియా కేర్ (న్యూజిలాండ్)-232 అగ్రస్ధానంలో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement