హర్యానాలోని జజ్జర్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మేన్‌పాల్ ధిల్లా (Mainpal Dhilla) అనే నేరస్థుడికి పెరోల్ లభించింది. ఎందుకో తెలుసా? కంబోడియాకు చెందిన తన లివింగ్ పార్టనర్‌ను పెళ్లాడేందుకు. జైలు సమీపంలోని ఒక ఫామ్‌హౌస్‌లో జరగనున్న ఈ వివాహం కోసం అతనికి ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు 12 గంటల పాటు 'కస్టడీ పెరోల్' మంజూరైంది. వివాహ తంతు ముగిసిన వెంటనే అతన్ని మళ్లీ జైలుకు తరలించనున్నారు.
ఇంతకీ ఎవరీ వధువు
వధువు మెటా చాన్ (Meta Chan) కంబోడియాకు చెందినమహిళ కావడంతో ఈ వివాహం నెట్టింట చర్చ నడుస్తోంది. గతంలో పెరోల్‌పై బయటకు వచ్చినప్పుడు కంబోడియాకు పారిపోయిన ధిల్లాకు ఆమెతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారు సహజీవనం చేశారు. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఇపుడిక వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. పెళ్లి కోసం మేటా చాన్ తన ముగ్గురు పిల్లలతో కలిసి భారత్‌కు చేరుకోగా, నాలుగో బిడ్డ కంబోడియాలోనే ఉండిపోయినట్టు సమాచారం.
ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేష్ కుమార్ జైలుకెళ్లాల్సిందే : సంజయ్ రౌత్ ఆగ్రహం
గ్యాంగ్‌స్టర్ మేన్‌పాల్ నేరచరిత్ర
మేన్‌పాల్ ధిల్లాపై హత్య కేసులతో పాటు మొత్తం 22 కేసులు ఉన్నాయి. 2007, 2010లో నమోదైన మూడు కేసుల్లో దోషిగా తేలడంతో హిసార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. జైలులో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని చంపినట్లు కూడా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే 2018 జూలైలో ఆరు వారాల పెరోల్‌పై విడుదలయ్యాడు. కానీ మరుసటి నెలలోనే 'సోను కుమార్' అనే నకిలీ పేరుతో దేశం విడిచి పారిపోయాడు. కంబోడియాలో తన గుర్తింపును మార్చుకుని వ్యాపారాన్ని ప్రారంభించాడు.
#WATCH | Jhajjar, Haryana: Gangster Mainpal Badli arrived at the venue under police security for his wedding. The court has granted him 12-hour parole to marry his Cambodian partner. pic.twitter.com/A10WvsnRBM
— ANI (@ANI) September 24, 2026
కేసు విచారణలో భాగంగా చివరకు అతను కంబోడియాలో ఉన్నాడనే సమాచారం దర్యాప్తు సంస్థలకు లభించింది. హర్యానా పోలీసుల అభ్యర్థన మేరకు, సీబీఐ 2024 నవంబర్‌లో అతనిపై ఇంటర్‌పోల్ 'రెడ్ నోటీసు' జారీ చేసింది. చివరికి కంబోడియా అధికారుల సహాయంతో అతని ఆచూకీ కనుగొని, 2025 జూలైలో కంబోడియాలో అరెస్టు చేశారు సెప్టెంబర్‌లో భారత్‌కు తీసుకొచ్చారు అధికారులు. ప్రస్తుతం హర్యానా జైలులో మేన్‌పాల్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.
ఇదీ చదవండి: స్లీపర్ బస్సు విషాదం : షాకింగ్ విషయాలు వెలుగులోకి


