సాక్షి, న్యూఢిల్లీ: భారత ఎన్నికల కమిషన్‌లో విబేధాలు, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్లమెంట్ సభ్యురాలు మహువా మోయిత్రా, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌పై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విధానపరమైన ఉల్లంఘనలు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, ఓటర్ల జాబితాలను తారుమారు చేశారనే ఆరోపణలతో గురువారం అధికారికంగా ఫిర్యాదు చేశారు.
అనంతరం మాట్లాడుతూ ఈ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ 'దొంగ' అని మండిపడ్డారు. అందుకే అతనిపై ఇక్కడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. ఎన్నికల కమిషనర్లు తమ విధులను నిర్వర్తించేటప్పుడు సివిల్ మరియు క్రిమినల్ విచారణ నుండి మినహాయింపు పొందుతారని చెప్పే 2023 నాటి సీఈసీ, ఈసీ చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం, మినహాయింపు పొందుతున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: జీవిత ఖైదు : కాంబోడియా ప్రియురాలితో గ్యాంగ్‌స్టర్ పెళ్లికి పెరోల్
Gyanesh Chor Kumar is a rogue agent who acted without consent of other 2 ECs. Disenfranchising genuine voters is not official duties. He cannot enjoy immunity. He needs to be prosecuted. Simple pic.twitter.com/CY8rES46Ki
— Mahua Moitra (@MahuaMoitra) September 24, 2026
అంతేకాదు ఆయనొక ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని మహువా ఎక్స్‌లో ధ్వజమెత్తారు.ఇటీవలి నివేదికను ఉటంకిస్తూ, ఈసీఐలోనిఅంతర్గత విభేదాలు, నిర్ణయాలు ఏకాభిప్రాయంతో లేదా మెజారిటీతో కాకుండా ఏకపక్షంగా తీసుకుంటున్నారని చూపిస్తున్నాయని కృష్ణానగర్ ఎంపీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: గ్రానైట్ బారన్, వీరమణి బాగోతం : మీడియా చేతికి షాకింగ్ వీడియోలు


