యవ్వనం కోసం 'బ్లెఫ్' సర్జరీ ట్రెండ్‌..! వైద్యుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌ | Beauty: youthful appearanceBleph Surgery: Unable To Close Eyes | Sakshi
Sakshi News home page

యవ్వనం కోసం 'బ్లెఫ్' సర్జరీ ట్రెండ్‌..! వైద్యుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Sep 24 2026 12:18 PM | Updated on Sep 24 2026 12:47 PM

Beauty: youthful appearanceBleph Surgery: Unable To Close Eyes

యవ్వనం కోసం సోషల్‌ మీడియా పుణ్యమా అని ఎన్నో ట్రెండ్‌లు నెట్టింట పుట్టుకొస్తున్నాయో. అందులో వాస్తవమెంతా అనేది అనవసరం. దీని వల్ల ఎప్పటికీ యవ్వనంగా ఉంటమన్నదే ప్రధానం. అలా ఎందరో తొందరపడి కాస్మెటిక్‌ సర్జరీలు చేయించుకుని తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా నెట్టింట ట్రెండ్‌గా మారి ‘బ్లెఫ్‌’ అనే శస్త్ర చికిత్స సైతం అలానే సమస్యల పుట్టగా మారి కన్నీళ్లు పెట్టిస్తోంది మహిళలకు.

అసలేం జరిగిందంటే..ముఖానికి అందం నయనాలు. కలువ రేకుల్లాంటి కళ్లే ముఖంలోని అందాన్ని చెప్పేస్తాయి. అలాంటి కళ్లే మనలోని వృద్ధాప్యాన్ని సైతం ఇట్టే చూపించేస్తాయి. కళ్లకింద ముడతలు, ఉబ్బడం వంటి వయసు రీత్యా మార్పులు వృద్ధాప్యాన్ని బయటపెట్టేస్తాయి. అలాంటి వృద్ధాప్యానికి చెక్‌పెట్టేలా ఎన్నో సౌందర్య సాధనాలు, సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఒకటే ఈ బ్లెఫ్‌ సర్జరీ. ఇది కళ్లను అందంగా కనిపించేలా చేసి..ఎప్పటికీ యవ్వనంగా కనిపించేలా చేస్తుందట. 

ఈ సర్జరీ టిక్‌టాక్‌లలో తెగ ట్రెండ్‌ అవుతోంది. దాంతో చాలామంది మహిళలు ఈ సర్జరీ చేయించుకునేందుకు రెడి అయిపోయారు. అంతేగాదు కొందరు విదేశాల్లో ఈ సర్జరీ తక్కువ మొత్తంలోనే చేస్తారని తెలుసుకుని మరి అక్కడకు వెళ్లి మరి చేయించుకుంటున్నారు. అలా చేయించుకున్న వాళ్లంతా అందం సంగతి దేవుడెరుగు..కంటి సమస్యలతో బాధపడుతున్నామంటూ లబోదిబోమంటున్నారు. అంతేగాదు కొందరు ఆ సర్జరీ మాకు భయానక అనుభవాన్ని మిగిల్చిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరికొందరు మా వద్ద అంత డబ్బు ఉండకపోతే అస్సలు ఆ సర్జరీ జోలికి వెళ్లే వాళ్లం కాదని బాధపడుతున్నారు. 

ఈ సర్జరీలో ఏం చేస్తారంటే..
ఈ బ్లెఫ్‌ సర్జరీలో కంటి చుట్టు ముడతలుగా ఉన్న చర్మాన్ని తొలగించి..యవ్వనంగా కనిపించేలా చేస్తారు. అయితే ఇలా కనురెప్పల చుట్టూ ఉన్న అదనపు చర్మం తొలగించడం వల్ల ఇదివరకటి ఆకృతి సంతరించుకుని యవ్వన రూపాన్ని పొందుతారట. అయితే ఇలా చేయించుకున్నవాళ్లు అందుకు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది కూడా. 

అయితే ఈ సర్జరీ తర్వాత కొందరు మహిళలు పైకి ఎత్తి కళ్లు చూసినప్పుడల్లా రక్తపు కన్నీళ్లు రావడం, కుట్టు వేసిన ప్రాంతాల్లో ఎర్రటి చారలు రావడం జరుగుతోందట. అలాగే కొందరికి దృష్టి సమస్యలు, మరికొందరికి నిద్ర అనేది పీడకలలా మారిపోయిందట. 

వైద్యులు ఏమంటున్నారంటే.. 
కంటిని పూర్తిగా కప్పి, రక్షించడానికి కనురెప్పలకు తగినంత చర్మం అవసరమని సర్జన్లు వివరిస్తున్నారు. చర్మాన్ని ఎక్కువగా తొలగిస్తే, కనురెప్పలు సరిగ్గా మూసుకోలేవు, దీనివల్ల కళ్ళు బయటకు కనిపించి, దెబ్బతినే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు ఇలా సర్జరీ చేయించుకున్న మహిళల్లో చాలామందికి మచ్చలు ఏర్పడటం, కళ్ళు అసమానంగా మారడం, సర్జరీ గాయాలు మళ్లీ ఉత్పన్నమవ్వడం వంటి సమస్యలు ఎదురవుతున్నట్లు సమాచారం. 

ఇంతకీ ఈ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుందంటే..అక్షరాల రూ. 80 వేల నుంచి రూ. 4 లక్షల వరకు అవుతుందట. డబ్బులు ఖర్చు చేస్తే అందం వస్తుందో లేదో తెలియదు గానీ..సమస్యలు మాత్రం కొనితెచ్చుకోవడం ఖాయం అని తెలుస్తోంది కదూ..!.

ఇదీ చదవండి: లండన్‌ ఫ్యాషన్‌ వీక్‌ రన్‌వేపై భారత్‌ ఆదర్శ బాలక్‌..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement