నాలుగు సెకన్లలో పరిష్కరించి రికార్డు
4.5 సెకన్ల కంటే తక్కువ సగటున్న ఒకే ఒక్క బాలిక
ఒక ప్రయత్నంలో 3.54 సెకన్లలో పూర్తి!
బీజింగ్: నాలుగంటే నాలుగే సెకన్లు... ఇంత తక్కువ సయయంలో రూబిక్ క్యూబ్‌పైని రంగులు సరి చేసి ఆరేళ్ల చైనా బాలిక లియాన్ యూంగ్జీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే ఈ అమ్మాయి ఈ నెల మొదట్లో నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టడం విశేషం. చైనాలోని వూహాన్ నగరంలో వరల్డ్ క్యూబ్ అసోసియేషన్ సర్టిఫై చేసిన పోటీల్లో లియాన్ ముందు 4.52 సెకన్లతో రూబిక్ క్యూబ్‌ను పరిష్కరించింది. ఆ తరువాత గాంగ్‌జౌలో జరిగిన ఇంకో పోటీలో మరింత తక్కువ సమయం అంటే 4.27 సెకన్లలోనే పూర్తి చేసిందని చైనా అధికారిక ప్రసార సంస్థ సీసీటీవీ తెలిపింది.
A six-year-old Chinese girl has set a new women's world record by solving Rubik’s cubes at an average pace of just over four seconds per cube.
It was the second time in three days Lian Yunzhi set a new record, having first done with an average time of 4.52 seconds. pic.twitter.com/8q0sdaCm29— ABC News (@ABC) September 23, 2026
రూబిక్ క్యూబ్‌ను పరిష్కరించడంలో సగటున 4.5 సెకన్ల కంటే తక్కువ సమయం మాత్రమే తీసుకున్న మొదటి స్పీడ్ క్యూబర్ లియాన్ అని తెలిపింది. వూహాన్ పోటీల్లో తలకు ఎర్రటి పట్టీ కట్టుకుని చిట్టి చేతులతో రూబిక్ క్యూబ్‌ను పట్టుకున్న లియాన్‌ను చూస్తే చాలా సీరియస్‌గా కనిపించింది కానీ.. ఒకానొక ప్రయత్నంలో 3.54 సెకన్లలోనే క్యూబ్‌ను పరిష్కరించడంతో ఆ బాలిక పెదవులపై చిరునవ్వు తొణికిస లాడింది. నాలుగేళ్ల వయసుండగానే లియాన్ రూబిక్ క్యూబ్‌ను పరిష్కరించడం మొదలుపెట్టిందని, తొలినాళ్లలో ఇందుకు 90 సెకన్ల సమయం పట్టేదని సీసీటీవీ తెలిపింది.
రోజూ రెండు మూడు గంటలపాటు ప్రాక్టీస్ చేస్తూ, సుమారు 1300 ఫార్ములాలపై లియాన్ పట్టు సాధించినట్లు సీసీటీవీ తెలిపింది. గతంలో పోటీల్లో పాల్గొనేందుకు సంశయించిన లియాన్ ఇప్పుడు చాలా ధీమాగా కనిపిస్తోందని తల్లి లిన్ యాంగ్జీ తెలిపారు. లియాన్‌కు మంచి శిక్షణ ఇప్పించేందుకు తల్లిదండ్రులు ఆమెను షాంఘైకి కూడా తీసుకెళ్లారట.
ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేష్ కుమార్ జైలుకెళ్లాల్సిందే : సంజయ్ రౌత్ ఆగ్రహం


