ఈసారి కాంస్యంతో సరి | Indian badminton team loses to China in semis | Sakshi
Sakshi News home page

ఈసారి కాంస్యంతో సరి

Sep 24 2026 4:01 AM | Updated on Sep 24 2026 4:01 AM

Indian badminton team loses to China in semis

సెమీస్‌లో చైనా చేతిలో భారత బ్యాడ్మింటన్‌ జట్టు ఓటమి

గత ఆసియా క్రీడల ఫైనల్లో చైనా చేతిలో ఓడిపోయి రజత పతకం సాధించిన భారత పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు ఈసారి కాంస్య పతకంతో సంతృప్తి పడింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ చైనా జట్టుతో బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు 1–3తో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో లక్ష్య సేన్‌ 16–21, 18–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ షి యుకీ చేతిలో ఓడిపోయాడు. రెండో మ్యాచ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ 21–11, 22–20తో లియాంగ్‌ వె కెంగ్‌–వాంగ్‌ చాంగ్‌ జంటను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. 

మూడో మ్యాచ్‌లో ఆయుశ్‌ శెట్టి 19–21, 13–21తో ప్రపంచ 12వ ర్యాంకర్‌ లీ షి ఫెంగ్‌ చేతిలో ఓటమి చవిచూశాడు. నాలుగో మ్యాచ్‌లో హరిహరన్‌–ఎంఆర్‌ అర్జున్‌ జోడీ 16–21, 21–17, 9–21తో చెన్‌ బొయాంగ్‌–లియు యి జంట చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖరారైంది. కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, తరుణ్‌ మన్నేపల్లి, ధ్రువ్‌ కపిల కూడా సభ్యులుగా ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement