టాలీవుడ్ నటి సమంత తన ప్రెగ్నెంట్‌కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ..చిల్ అవుతోంది. మాతృత్వపు మధురిమకు సంబంధించి..ప్రతి నెలలో తనలో వస్తున్న మార్పులు..ఎదుర్కొంటున్న అనుభవం గురించి పంచుకుంటూ కాబోయే తల్లిగా పలు సూచనలు కూడా అందిస్తోంది. ఈసారి బ్రేక్‌ఫాస్ట్‌కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తన భర్త రాజ్ నిడిమోరుని పార్ట్‌టైం తమిళుడిగా అభివర్ణించింది.
అంతేగాదు చెన్నై అల్పాహారం అనుభవంపై ప్రశంసల వర్షం కురిపించింది. అందుకు సంబంధించి..రకరకాల చట్నీలు, సాంబార్‌తో కూడిన దోశ ఫోటోని షేర్ చేస్తూ..చెన్నై అల్పాహారంకి మించిది లేదు అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది.
కాగా సమంత-రాజ్‌లు డిసెంబర్‌లో తమ బిడ్డకు స్వాగతం పలకనున్నారు. మా ఇంటి బంగారం సక్సెస్ మీట్‌లో తన గర్భధారణ విషయాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలాగే తన నటనకు కొన్నేళ్ల పాటు విరామం తీసుకోనున్నట్లు కూడా పేర్కొంది.
ఇదీ చదవండి: ‘రెండుసార్లు’ జన్మించిన శిశువు! మెడికల్ మిరాకిల్)


