మిల్కీ బ్యూటీ, నటి తమన్నా తన తాజా చిత్రం ది వివాన్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. అందులో భాగంగానే అద్భతమైన మధుబని ఓధాని చీరలో సంప్రదాయ మహిళలా తళుక్కుమంది.
టోరానీ బ్రాండ్ డిజైన్ చేసిన ఈ సంప్రదాయ దుస్తుల్లో తమన్నా లుక్ అత్యంత ప్రత్యేకంగా నిలిచింది.
ముఖ్యంగా తమన్నా ధరించి మధుబని ఓధనా చీరలో ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టతలు ఉన్నాయి.
ఈ చీరను బీహార్‌కు చెందిన నలుగురు సాంప్రదాయ మిథిలా కళాకారులు తమ చేతితో అద్భుతమైన కళాఖండంలా తీర్చిదిద్దారు.
ఈ చీరపై కళాకారులు మిథిలా శైలి పెయింటింగ్‌తో రాధ కృష్ణులు, చుట్టూ ప్రకృతికి సంబంధించిన డిజైన్లతో తీర్చిదిద్దారు
అంతేగాదు ఈచీరలోని పసుపు నీలం రంగుల కలయిక బిహార్ సంస్కృతికి సంబంధించిన ఛత్ పండుగను ఇది వృత్తంగా తీసుకుని డిజైన్ చేశారు.
అలాగే ఈ మధుబని చిత్రకళ, లేదా మిథిలా కళ, వేద కాలం నాటిది. ఇక్కడ తమన్నా ధరించిన దుస్తులను వారసత్వంతో కలగలసిపోయేలా ఆధునిక ఫ్యాషనికి అనుగుణంగా తీర్చిదిద్దడం విశేషం.


