రాజస్థాన్‌లోని జైపూర్‌లో మెర్సిడెస్ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జైపూర్‌లోని బాలాజీ మార్కెట్‌లోని వర్క్‌షాప్‌లో జరిగిన ఈ ఈ ప్రమాదంలో సుమారు ఎనిమిది కార్లు, ఖరీదైన విడిభాగాలు (స్పియర్ పార్ట్స్), యాక్సెసరీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దట్టమైన పొగ ఐదు కిలోమీటర్ల దూరం వరకు కనిపించింది. ఈ ప్రమాదానికి సంబంధిచిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఫైర్ ఆఫీసర్ ఉషా శర్మ తెలిపిన వివరాల ప్రకారం, మంటలను అదుపు చేయడానికి సుమారు 10 ఫైర్ ఇంజిన్లు మోహరించారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి, రెండు డజన్లకు పైగా ట్రిప్పులతో మంటలనును పూర్తిగా అదుపులోకి తెచ్చారు. వర్క్‌షాప్‌లో కొత్త, పాత వాహనాలు కలిపి మొత్తం 50కి పైగా కార్లు పార్క్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సకాలంలో స్పందించి పలు కార్లను సురక్షితంగా బయటకు తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: రోజుకు రూ. 50 వేలు : ఈమె వ్యాపారం ఏంటో తెలుసా?
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, దీనిపై పూర్తి విచారణ జరుగుతోందని పోలీసు అధికారులు వెల్లడించారు. మరోవైపు జైపూర్‌లోని నారాయణ్ సింగ్ సర్కిల్ సమీపంలో ఒక మాల్‌లో కూడా మరో అగ్నిప్రమాదం జరగగా, రెండు ఫైర్ టెండర్లు అర్ధగంటలోపే మంటలను అదుపు చేశాయి.
जयपुर में करोडों रूपये की लग्जरी गाड़ियाँ जल कर खाक.सीतापुरा के T&T मोटर्स वर्कशॉप में देर रात आग का तांडव. आधा दर्जन दमकलों ने घंटों की मशक्कत के बाद पाया काबू. pic.twitter.com/aDA4OZ7TNs
— Balmukund Joshi (@balmukundjoshi) September 23, 2026
ఇదీ చదవండి : పక్కింటి వైఫై సాయం : స్లమ్ నుంచి ఢిల్లీ ఐఐటీ దాకా ఎవరీ అభిషేక్


