ఈస్టర్ సండే ఉగ్రదాడులు : 15 మందిని దోషులుగా తేల్చిన శ్రీలంక కోర్టు | Sri Lanka court convicts 15 men over deadly Easter Sunday bombings | Sakshi
Sakshi News home page

ఈస్టర్ సండే ఉగ్రదాడులు : 15 మందిని దోషులుగా తేల్చిన శ్రీలంక కోర్టు

Sep 22 2026 7:01 PM | Updated on Sep 22 2026 7:03 PM

Sri Lanka court convicts 15 men over deadly Easter Sunday bombings

శ్రీలంకలో  మారణహోమాన్ని  సృష్టించిన  ఈస్టర్ సండే దాడులకు సంబంధించి శ్రీలంక హైకోర్టు  సంచలన నిర్ణయం  ప్రకటించింది.  2019 ఈస్టర్ సండే నాడు జరిగిన బాంబు దాడులకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 15 మందిని దోషులుగా నిర్ధారించింది ఈ దాడులలో 270 మంది మరణించగా, 500 మందికి పైగా గాయపడ్డారు.

శ్రీలంకలో 2019 ఏప్రిల్ 21న జరిగిన  ఉగ్ర దాడులు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈస్టర్ ప్రార్థనలు, వేడుకల సమయంలో మూడు చర్చిలు, మూడు హోటళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఐసిస్ (Islamic State) ప్రేరేపిత ఈ దాడుల్లో 42 మంది విదేశీయులు కూడా దుర్మరణం పాలయ్యారు. శ్రీలంక చరిత్రలో అత్యంత ఘోరమైన దాడులుగా నిలిచాయి. 

2021లో అధికారులు 24 మంది అనుమానితులపై హత్య, ఉగ్రవాద కుట్ర, పేలుడు పదార్థాల చట్టం కింద 23,270 అభియోగాలు మోపారు.ప్రాసిక్యూషన్ తరఫున 2,300 మందికి పైగా సాక్ష్యం ఇచ్చారు. అయితే ఈ దాడులు జరిపిన బాంబర్లందరూ పేలుళ్లలోనే మరణించారు. ఈ దాడులకు ఇస్లామిస్ట్ తీవ్రవాదులే కారణమని దర్యాప్తు అధికారులు గతంలో ఆరోపించారు. అభియోగాలు ఎదుర్కొంటున్న 25 మంది శ్రీలంకలోని ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినవారే. వారిలో ఒకరు కస్టడీలో మరణించారు. శ్రీలంకలో 1976 నుండి మరణశిక్షలు అమలు చేయకపోవడంతో, సాధారణంగా మరణశిక్ష పడిన వారికి జీవిత ఖైదు విధిస్తారు. ఈ దాడులకు సంబంధించి గూఢచార హెచ్చరికలపై సకాలంలో స్పందించనందుకు గతంలో మాజీ పోలీసు చీఫ్, మాజీ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక అధికారులకు కూడా మరణశిక్ష విధించడం గమనార్హం. 

ఇదీ చదవండి: రూ. 2 లక్షల కోట్లు : జపాన్‌కు ధీటుగా హై-స్పీడ్ బుల్లెట్ రైలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement