ఎప్పటికీ తల్లిని కాలేననుకున్నా..!: శ్రుతి హాసన్‌ | Shruti Haasan said always told difficult to conceive due to her PCOS | Sakshi
Sakshi News home page

Shruti Haasan: ఎప్పటికీ తల్లిని కాలేననుకున్నా..!: శ్రుతి హాసన్‌

Sep 22 2026 1:48 PM | Updated on Sep 22 2026 1:48 PM

Shruti Haasan said always told difficult to conceive due to her PCOS

టాలీవుడ్‌ నటి, విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ ముద్దుల తనయ శ్రుతి హాసన్‌ గర్భధారణ గురించి చాలాచాలా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను 14 ఏళ్ల వయసు నుంచే పీసీఓఎస్‌(పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్)ని ఎదర్కొన్నట్లు తెలిపారు. దీని వల్ల భవిష్యత్తులో గర్భం దాల్చడం కష్టమని చాలామంది వెద్యులు హెచ్చరించనట్లు గుర్తుచేసుకుంది. ప్రతి ఒక్కరూ అమ్మా.. ఇది చాలా కష్టం భవిష్యత్తులో తల్లి అయ్యే అవకాశాలు తక్కువ అంటూ చెబుతుండేవారని, దాంతో తాను ఎంతగా ఆందోళన చెందిందో కూడా చెప్పుకొచ్చింది. 

అంతేగాదు ఒకానొక టైంలో అవసరమైతే పిల్లలను దత్తత తీసుకుందామని ఫిక్స్‌ అయినట్లు కూడా చెప్పుకొచ్చింది. సోహా అలీఖాన్‌తో జరిగిన పాడ్‌కాస్ట్‌లో ఈ విషయాలను పంచుకుంది శ్రుతి హాసన్‌. అయితే 53 ఏళ్ల వయసులో  కామెరాన్ డయాజ్ బిడ్డకు జన్మనివ్వడంతో తనకు తల్లి అయ్యే అవకాశంపై కొత్త ఆశను రేకెత్తించిందని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. పీసీఓఎస్‌ అంటే గర్భందాల్చడం లేదా పిల్లలను కనడం గురించి పూర్తిగా మర్చిపోవాలని చెబుతుండే మాటలు వింటూ పెరిగానని తెలిపింది. 

అయితే డాక్టర్‌ ధృప్తి దేధియా తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందన్నారు. నువ్వు తల్లివి కావాలనుకుంటే..తనకు చెప్పమని, అప్పుడు తగిన పరిష్కారం చెబుతానని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఆమె పీసీఓఎస్‌ వల్ల గర్భందాల్చడం కష్టమైనప్పటికీ..అసాధ్యమైతే కాదని నమ్మకం అందించారని చెప్పుకొచ్చారు శ్రుతి హాసన్‌. తనకు డాక్టర్‌ అలా భరోసా ఇవ్వడం తనకు ఎంతో సంతోషాన్నించిందంటూ   తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. 

కాగా, సాధారణ నెలలో ఒక ఫొలికల్‌ పెరిగి పరిపక్వం చెంది అండాన్ని విడుదల చేస్తుంది. అయితే పీసీఓఎస్‌ ఉంటే..అనేక ఫొలికల్స్‌ పెరగడం మొదలవుతాయి. అయితే ఏ ఒక్కటి ప్రధానంగా ఎదగదని చెబుతున్నారు వైద్యులు. సాధారణంగా 28 రోజుల రుతుచక్రం ఉంటే..ఏడాదికి దాదాపు 12 లేదా 13 అవకాశాలు లభిస్తాయి. అదే 60 లేదా 90 రోజుల చక్రం ఉన్న మహిళకు 4 లేదా 5 అవకాశాలు మాత్రమే లభిస్తాయి.

నిజంగానే పీసీఓఎస్‌ గర్భధారణను ప్రభావితం చేస్తుందా?
సాధారణంగా ప్రతి నెలా అండాశయం నుండి ఒక అండం విడుదలవుతుంది. కానీ పీసీఓఎస్ ఉన్నవారిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల అండం సరిగ్గా పెరగక లేదా సకాలంలో విడుదల కాక పీరియడ్స్ క్రమం తప్పుతాయి. అండం విడుదల కానప్పుడు సహజంగానే గర్భం దాల్చడం ఆలస్యమవుతుంది. దీన్ని సరైన జీవనశైలి, చక్కటి ఆహారపు అలవాట్లతో ఈ సమస్యను జయించొచ్చని చెబుతున్నారు వైద్యులు. 

బరువుని అదుపులో ఉంచుకుంటూ సమతుల్యమైన ఆహారం తీసుకొంటూ ఉంటే..పీరియడ్స్‌ ఇర్‌రెగ్యులర్‌గా రావడం అనేది ఉండదని చెబుతున్నారు. అలాగే వైద్యులు పీరియడ్స్‌ క్రమం తప్పకుండా ఉండేలా కొన్ని ఇంజెక్షన్లు సూచిస్తారని, వాటి సాయంతో ఈ సమస్యలను అధిగమించొచ్చని చెబుతున్నారు వైద్యులు.

(చదవండి: Mrunal Thakur: లూసీ చీరలో స్టైలిష్‌గా మృణాల్‌ ఠాకూర్‌..!)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement