నిద్ర లేవగానే ఫోన్‌ చూస్తున్నారా? ఈ అలవాటు ప్రమాదమే! | Morning Phone Use Smartphone Stress Mental Health | Sakshi
Sakshi News home page

నిద్ర లేవగానే ఫోన్‌ చూస్తున్నారా? ఈ అలవాటు ప్రమాదమే!

Sep 12 2026 6:26 AM | Updated on Sep 12 2026 6:26 AM

Morning Phone Use Smartphone Stress Mental Health

లైఫ్‌

హెల్త్‌

దయం నిద్ర లేవగానే తెలియకుండానే ఫోన్‌ వైపు చెయ్యి చాచడం ఈ రోజుల్లో అందరికీ ఒక అలవాటుగా మారిపోయింది. కేవలం అలారమ్‌ ఆపడం కోసమే ఫోన్‌ చేతిలోకి తీసుకున్నప్పటికీ! ఆ తర్వాత తెలియకుండానే సోషల్‌ మీడియా స్క్రోలింగ్‌లో మునిగిపోతున్నాం. దీనివల్ల అసలు రోజేప్రారంభం కాకముందే, మనస్సు రకరకాల ఆలోచనలతో నిండిపోయి తీవ్రమైన ఒత్తిడికి గురవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఫోన్‌కే మొదటిప్రాధాన్యత ఇవ్వడం వల్ల, మన రోజు ఒక నెగెటివ్‌ ఆలోచనలు, బలహీనమైన మానసిక స్థితితోప్రారంభమవుతోందట.

మంచం దిగకముందే ఫోన్‌ చూడటం వల్ల మన మానసిక శక్తి తగ్గిపోతుందట. అంతేకాదు, ఆ రోజంతా మనం ఏ పని సరిగ్గా చేయలేమని పరిశోధకులు చెబుతున్నారు. మనం నిద్రలేవగానే ఒక్కసారిగా వచ్చే సందేశాలు, ఈ మెయిల్‌లు, సోషల్‌ మీడియా అప్‌డేట్‌లను చూడటం వల్ల శరీరంలో ‘కార్టిసాల్‌’ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఫోన్‌ చూసే ముందు నీళ్లు తాగడం, బాడీ స్ట్రెచింగ్, ఆ రోజు పనులను ప్రణాళిక బద్ధంగా చేసుకోవడం వంటి వాటి కోసం ప్రతిరోజూ ఉదయం కేవలం 20 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు. ఫోన్‌కి బదులు అలారం ఉపయోగిస్తే క్రమంగా మొబైల్‌ మీద ఆధారపడే అలవాటు తగ్గుతుందని చెబుతున్నారు.

ఇవీ చదవండి: ‘నీకు ఓ విషయం చెప్పాలి.. మళ్లీ ఎవరికీ చెప్పొద్దు!’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement