తొలివారమే రెండో ఎలిమినేషన్.. 'ఆమె'ని పంపేశారు! | Bigg Boss 10 Telugu Chaitra Rai Eliminated | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Telugu: మరో షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ ప్లాన్ ఏంటి?

Sep 11 2026 12:50 PM | Updated on Sep 11 2026 12:56 PM

Bigg Boss 10 Telugu Chaitra Rai Eliminated

తెలుగు బిగ్‌బాస్ 10వ సీజన్ మొదలై నాలుగు రోజులే అయింది. ఇంతలోనే ఓవైపు గొడవలతో హౌస్ హీటెక్కిపోతుంటే మరోవైపు వరస ఎలిమినేషన్లు షాకిస్తున్నాయి. సామాన్యుల కోసం పెట్టిన అగ్నిపరీక్ష పోటీలో గెలిచి ఆదివారం హౌస్‌లోకి అడుగుపెట్టిన చరణ్.. గురువారం ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయిపోయాడు. ఇదలా ఉండగానే లేడీ కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయిందనే విషయం హాట్ టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: వీకెండ్ ధమాకా.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు)

ఈసారి 16 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. వీళ్లలో 10 మంది సెలబ్రిటీలు కాగా మిగిలిన 6గురు అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కామనర్స్. వీళ్లని ప్రస్తుతం బ్లూ, రెడ్ టీమ్స్‌గా విభజించి గేమ్స్ పెడుతున్న బిగ్‌బాస్.. అలా హై రిస్క్ జోన్‌లోకి వచ్చి తక్కువ ఓట్లు పొందిన చరణ్‌ని బయటకు సాగనంపేశాడు. తాజా ఎపిసోడ్‌లో భాగంగా హై రిస్క్ జోన్‌లోకి కామరన్స్ నుంచి అమన్.. సెలబ్రిటీల నుంచి సుధీర్, చైత్ర వచ్చినట్లు తెలుస్తోంది.

వీళ్ల ముగ్గురిలో ఈసారి సీరియల్ నటి చైత్రకు తక్కువ మంది సపోర్ట్ చేయడంతో ఈమె ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఇక్కడ ఎలిమినేషన్ అంటే పూర్తిగా బయటకొచ్చేసినట్లు కాదు. ఇక్కడే ఓ ట్విస్ట్ ఇవ్వబోతున్న బిగ్‌బాస్.. మిడ్ వీక్ బయటకొచ్చిన చరణ్, చైత్రని మళ్లీ హౌస్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం. తర్వాత వీళ్లిద్దరి మధ్య పోటీపెట్టి వీళ్లలో ఒకరిని ఈ ఆదివారం నిజంగానే ఎలిమినేట్ చేయనున్నారు. మరి ఆ దురదృష్టవంతులు ఎవరనేది చూడాలి?

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: చరణ్ ఎలిమినేట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి మాటలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement