'కోర్ట్' సినిమాతో సక్సెస్ అందుకుని గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి.. ఆ వెంటనే 'బ్యాండు మేళం' అనే మూవీ చేసింది. ఇది అస్సలు వర్కౌట్ కాలేదు. అయితే 'కోర్ట్' హిట్ అయ్యేసరికి ఈమెకు తమిళంలో అవకాశం వచ్చింది. అలా ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ చేసింది. ఆ చిత్రమే 'హైకూ'. ఇప్పుడు దీని రిలీజ్ డేట్ ప్రకటించారు.
ఏగన్ హీరోగా చేసిన ఈ సినిమాలో శ్రీదేవితో పాటు మలయాళ బ్యూటీ ఫెమినా జార్జ్ హీరోయిన్‌గా చేసింది. యువరాజ్ చిన్నస్వామి దర్శకుడు. సిద్దు కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తాజాగా టీజర్ రిలీజ్ చేసి వచ్చే నెల 23న మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.


