శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘చకోర’. దర్శకుడు పూరి జగన్నాథ్ వద్ద ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన మంగా శ్రీనివాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో డా. చింతాడ హేమారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రసంగీత దర్శకుడు ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ధమ్ ధమ్... అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు.
ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా మెహర్ బాబా కొరియోగ్రఫీ చేశారు. అభిఖ్య తనికెళ్ళ ఈ పాటను పాడారు. ‘‘ఈ మాస్ సాంగ్ యువతను ఊర్రూతలూగించేలా ఉంది’’ అని పాటను విడుదల చేసిన సంగీతదర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్ అన్నారు. అక్టోబరు 8న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.


