ఇండియన్ సినిమాలో అతి తక్కువ మంది బోల్డ్ అండ్ బ్యూటీ హీరోయిన్లలో నటి శృతిహాసన్ ఒకరిని చెప్పవచ్చు. ఈమె ఫెయిర్ నెస్, డేరింగ్ నెస్ గురించి అందరికీ తెలిసిందే. నటి వారసురాలుగా సినీ రంగ ప్రవేశం చేసినా, ఆ తరువాత తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు కమలహాసన్ పుత్ర రత్నం ఈ బహుముఖ ప్రతిభావంతురాలు శృతిహాసన్. గాయనిగా, సంగీత దర్శకురాలిగా, కథానాయకిగా తనదైన శైలిలో దూసుకుపోతున్న ఈ బ్యూటీ బహుభాషా కథానాయకి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇకపోతే ఈమె సంచలన నటి ఏ విషయంలోనైనా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
ఎవరో వచ్చి ఏదో చేస్తారు.. చూస్తారు అని ఎదురు చూడటం శృతిహాసన్ నైజం కాదు. ఇందుకు చిన్న ఉదాహరణ ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దాని వల్ల ప్రయోజనం ఎంత కలుగుతుందో, అదే స్థాయిలో దు్రష్పచారం జరుగుతోందన్నది ఎవరూ కాదనలేని సత్యం. ముఖ్యంగా సెలబ్రిటీస్ ఎక్కువగా సాధింపులకు గురౌతున్నారు. ఇక సినిమా రంగంలో కథానాయికలు డీఫేమ్ చర్యలతో మానసిక వేదనకు గురౌతున్నారు. తమ ప్రమేయం లేకుండానే తమ రూపాలు, వ్యాఖ్యలను మార్పింగ్ చేస్తున్నారు.
దీంతో మనోవేదనకు గురౌతున్న పలువురు నటీమణులు ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారే కానీ ఎవరూ కార్యాచరణకు ముందడుగు వేయడం లేదు. అయితే నటి శృతిహాసన్ మాత్రం ధైర్యంగా ముందడుగు వేసి ఏఐ టెక్నాలజీతో మహిళలను డీఫేమ్ చేస్తున్న వారికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసి గెలిచారు. ఏఐ టెక్నాలజీతో అక్రమాలకు పాల్పడే చర్యలపై ఇటీవల ముంబై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు నటి శృతిహాసన్ చాలా మందికి రోల్ మోడల్ అయిపోయారు. సినీ ఇండస్ట్రీలో చాలా మందికి మార్గదర్శిగా నిలిచారని ప్రశంసలను అందుకున్నారు.


