ఇటీవల ముగిసిన మిస్ వరల్డ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన నికితా పోరాల్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగభరితమైన లేఖ రాశారు. కిరీటాన్ని అందుకోలేకపోయినా..ఆ విస్ వరల్డ్ తనకు అందించి అనుభవం, ఆ ప్రయాణంలో తనకు లభించిన ప్రేమ, నేర్చుకున్న పాఠాలను గురించి లేఖలో పంచుకుంది. తన మిస్‌వరల్డ్ జర్నీకి సంబంధించిన ఫోటోల తోపాటు ఈపోస్ట్‌ని కూడా జోడించి షేర్ చేసింది. ఆ లేఖలో నికితా ఇలా రాసుకొచ్చింది.
"మిస్ వరల్డ్ ఫైనల్ తర్వాత కిరీటం లేకుండా ఇంటికి రావడం అత్యంత కష్టమైన విషయం, అయినా అక్కడ పొందిన ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు. అక్కడ తనకు లభించిన ప్రేమ, మద్దతు..ఇలా ప్రతీదాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. మీరంతా నేను కిరీటాన్ని గెలుచుకోవాలని కొండంత ఆశతో ఎదురుచూశారు. అలా ఇంతకుమందెన్నడూ చూడని ఎన్నో కుటుంబాల ప్రేమను సంపాదించుకున్నాను.
అందాల పోటీల ప్రపంచంలో అత్యంత విచిత్రమైన మరియు అందమైన విషయం ఏమిటంటే, కొన్నిసార్లు మీకు మద్దతు ఇచ్చే అకౌంట్ల వెనుక ఉన్న ముఖాలు మనకు తెలియవు. తెల్లవారుజామున 2 గంటలకు ఆ ఎడిట్ ఎవరు చేస్తున్నారో, ఆ సుదీర్ఘ సందేశం ఎవరు రాస్తున్నారో, కామెంట్ సెక్షన్‌లో నాకోసం ఎవరు పోరాడుతున్నారో, అప్‌డేట్ కోసం పేజీని ఎవరు రిఫ్రెష్ చేస్తున్నారో కూడా తెలియదు... కానీ ఎలాగోలా వారి ప్రేమ మనకు తెలుస్తుంది అంటూ అభిమానులను ఉద్దేశించి రాసింది.". ఆ తర్వాత తన ఓటమి గురించి ఇలా పేర్కొంది.
" ‘ఇండియా' అని పిలిచే అదృష్టం దక్కించుకున్నా. అసలు ఆ వారాల పాటు, నా పేరు దాదాపు కనుమరుగైపోయింది, మర్చిపోయా. ఎవరైనా 'ఇండియా!' అని పిలవగానే ఏదో తెలియని పులకింత, ఒక అటెన్షన్ వచ్చేసేవి. నిజానికి నేను కిరీటాన్ని దక్కించుకోవాలని అనుకున్నా..బలంగా కోరుకున్నా..అందుకోసం ఎంతో కష్టపడ్డా.
కానీ ఓటమిని ఎదుర్కొన్నా..అయినప్పటికీ ఈ జర్నీలో ఎన్నో జ్ఞాపకాలు, స్నేహాలు, ప్రేమలు సంపాదించుకుని సరికొత్త నికితాగా ఇంటికి తిరిగి వచ్చా. కొన్ని విజయాలు వరించలేకపోయినా..హృదయంలో ఎన్నో జ్ఞాపకాలను పదిలంగా ఉంచుతాయి. ప్రేమతో మీ నికితా అంటూ తన పోస్ట్‌ని ముగించింది నికితా పోర్వాల్.
(చదవండి: అమ్మాయి నిజంగా బంగారం! ఆ డ్రెస్ అక్షరాల రూ. 4 కోట్లుపైనే..)


