పోస్ట్‌ చేశారంటే... మీ లొకేషన్‌  ట్రాక్‌ ఖాయం! | AI Find Your Location Using A Photo Without GPS | Sakshi
Sakshi News home page

పోస్ట్‌ చేశారంటే... మీ లొకేషన్‌  ట్రాక్‌ ఖాయం!

Sep 10 2026 6:30 AM | Updated on Sep 10 2026 6:30 AM

AI Find Your Location Using A Photo Without GPS

టెక్‌ స్పేస్‌

సోషల్‌ మీడియా అనేది మన జీవితాల్లో ముఖ్యమైన భాగం అయింది. ‘రీల్స్‌’ నుంచి విహారయాత్రలకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేసుకోవడం వరకు ఎన్నో చేస్తుంటాం.  గమనించాల్సిన విషయమేమిటంటే... ఏఐ సాధనాలను ఉపయోగించి పోస్ట్‌ల ద్వారా మీ లొకేషన్‌ను గుర్తించవచ్చునని గ్లోబల్‌ కంప్యూటర్‌ సెక్యూరిటీ కంపెనీ మెకఫీ స్టడీ తెలియజేస్తోంది...

స్టడీలో భాగంగా...
ఒక ఫొటోను జత చేసి, ఆ ప్రదేశాన్ని గుర్తించమని ప్రాంప్ట్‌ ఇచ్చారు. ఎలాంటి మెటాడేటా, ఇఎక్స్‌ఐఎఫ్‌ డేటా, ఫైల్‌ పేర్లను ఉపయోగించలేదు. చిత్రాలలోని సంకేతాలు, వాస్తుశిల్పం, వీధి గుర్తులు, దుకాణాలు, ఫుడ్‌స్టాల్స్‌... మొదలైన వివరాలతో ఏఐ సాధనాలు లొకేషన్‌ను గుర్తించాయి. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, విలక్షణమైన ప్రదేశాలను ఏఐ సులభంగా గుర్తించింది. సాధారణ బీచ్‌లు, గ్రామీణ రహదారులు, హోటల్‌ గదులను గుర్తించడం మాత్రం ఏఐకి కష్టమైంది.

మోసాలు జరుగుతాయా?
ఇంతకుముందు బహిరంగంగా పోస్ట్‌ చేయని ఫొటోలతో సహా పర్సనల్‌ ట్రావెల్‌ ఫొటోలను చాట్‌ జీపీటీ, క్లాడ్, కోపైలట్‌లాంటి వాటిలో అప్‌లోడ్‌ చేసి...‘ఈ ఫొటోలు ఎక్కడ తీశారు?’ అని అడిగారు. ఏఐ గుర్తించిన వాటిలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని హేస్టింగ్‌–ఆన్‌–హడ్సన్‌ అనే గ్రామం కూడా ఉన్నది. జీపీఎస్‌ డేటా, లొకేషన్‌ ట్యాగ్, క్యాప్షన్‌ లేకపోయినా సరే, ఆ ఫొటోలను ఎక్కడ తీశారనేది ఏఐ సాధనాలు గుర్తించగలవని మెకఫీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పదిలో తొమ్మిదిసార్లు ఏఐ సాధనాలు లొకేషన్‌ను సరిగ్గా ట్రాక్‌ చేశాయి. ఈ అధ్యయనంలో గూగుల్‌... జెమ్మ 227బీ, అలీబాబా 3వియల్‌ 3వోబీ అనే మోడల్స్‌ను ఉపయోగించారు. ఈ రెండు మోడల్స్‌ ఒపెన్‌–వెయిట్స్‌ రకానికి చెందినవి. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌ అవసరం లేకుండా ఉచితంగా ఉపయోగించవచ్చు. ...ఇలా లొకేషన్‌లను ట్రాక్‌ చేయడం ద్వారా మోసాలు జరుగుతాయా? ‘అవును’ అని చెబుతోంది మెకఫీ స్టడీ.

ఇలా జరగవచ్చు...
జెనెరిక్‌ పిషింగ్‌ నుంచి పర్సనలైజ్‌ ఫ్రాడ్‌ వరకు ఏదైనా జరగవచ్చు. ఉదాహరణకు ఒక మోసగాడు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్‌లాంటి ప్లాట్‌ఫామ్‌ల నుండి ఫొటోలను తీసుకొని వాటిని ఏఐ మోడల్స్‌లో ప్రాసెస్‌ చేసి లొకేషన్‌ ట్రాక్‌ చేసి, ఆ ప్రదేశాన్ని ప్రస్తావిస్తూ మెసేజ్‌లు పంపవచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు మీ బ్యాంక్‌ ఖాతాలో అసాధారణ లావాదేవిలు జరుగుతున్నట్లు, మీరు ఉన్న ప్రాంతంలోనే ఎవరో ఒకరు లాగిన్‌ కావడానికి ప్రయత్నిస్తున్నట్లు హెచ్చరికలు రావచ్చు.

‘మీరు షేర్‌ చేసిన ఫొటోలో ఏదైనా ప్రముఖ ప్రదేశం లేదా ల్యాండ్‌మార్క్‌ కనిపించకపోతే ఖచ్చితమైన లొకేషన్‌ను గుర్తించడంలో ఏఐ మోడల్స్‌ సమర్థంగా పనిచేయకపోవచ్చు’ అంటున్నారు నిపుణులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement