బాలీవుడ్ స్టార్ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె మరోసారి తమ కుమార్తె దువాను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు. దువా రెండో పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడు రాబోతున్న విషయాన్ని కూడా వెల్లడించారు.
ఇదీ చదవండి: దీపావళి బరిలో నయనతార కొత్త సినిమా!
‘మా చిన్నారి దువా.. నిన్ను ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్’ అంటూ రణ్‌వీర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దువాను చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు ఈ స్టార్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ‘నాతో పెట్టుకోవద్దు!’.. ఆటో రాంప్రసాద్ వార్నింగ్
కాగా.. రణ్‌వీర్, దీపికా 2024లో తల్లిదండ్రులయ్యారు. తమ కుమార్తెకు ‘దువా’ అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో దువా త్వరలో అక్క కానుంది.


