దీపావళి బరిలో నయనతార కొత్త సినిమా! | Mookuthi Amman2 Getting Ready For Diwali Release | Sakshi
Sakshi News home page

దీపావళి బరిలో నయనతార కొత్త సినిమా!

Sep 8 2026 6:12 PM | Updated on Sep 8 2026 6:35 PM

Mookuthi Amman2 Getting Ready For Diwali Release

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మూకుత్తి అమ్మన్-2’. ‘మూకుత్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) చిత్రానికి సీక్వెల్‌గా  తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ‘మహాశక్తి’ గా విడుదల కానుంది. 
ఈ చిత్రంలో నయనతార మరోసారి దేవతగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన నయనతార ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ ఇప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇదీ  చదవండి: దారులు ఏవైనా.. వసూళ్లు మాత్రం అదుర్స్‌.. ఎంతంటే?

ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుందట. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను సైతం వేగాంగా చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో రెజీనా, దునియా విజయ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సీనియర్‌ దర్శకుడు సుందర్‌.సి తెరకెక్కిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement