ఢిల్లీ: అర్హత లేని టీచర్లతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని, ‘టెట్’ లాంటి నిర్దేశిత అర్హతలు లేని ఉపాధ్యాయులను నియమించొద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పేర్కొంది. అర్హత లేని టీచర్ల నియామకంపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మద్యంతర ఆదేశాలిచ్చింది.
అస్సాం టీచర్ రిక్రూట్మెంట్ కేసులో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీచర్ల రిక్రూట్మెంట్‌పై సమీక్ష చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సరైనటువంటి విద్యార్హతలు లేకుండా టీచర్ల నియామకం చేపట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.


