పెట్రోలు కొరతతో క్యూబా ఏం చేసిందో తెలుసా? | Cuba Solar Autos Fuel Crisis Transportation | Sakshi
Sakshi News home page

ఇంధనం లేకున్నా రవాణా ఆగలేదు.. క్యూబా భలే ప్లాన్‌!

Sep 6 2026 12:01 PM | Updated on Sep 6 2026 12:01 PM

Cuba Solar Autos Fuel Crisis Transportation

ఫండే

టెక్నాలజీ

పెట్రోలు కొరతతో అల్లాడుతున్న క్యూబా.. ఇప్పుడు సరికొత్త దారిని ఎంచుకుంది! బస్సులు, ట్యాక్సీలు కనిపించాల్సిన రోడ్లపై.. సోలార్‌ ఆటోలు దూసుకెళ్తున్నాయి! చైనాలో తయారైన ఈ వాహనాలు క్యూబా రవాణా ముఖచిత్రాన్నే మార్చేస్తున్నాయి!

అమెరికా–ఇరాన్‌ యుద్ధం ఒకవైపు, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం మరోవైపు కొనసాగుతున్న నేపథ్యంలో చాలా దేశాలు పెట్రోలు కొరతతో ఇబ్బందిపడుతున్నాయి. చాలా దేశాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం పెరుగుతూ వస్తోంది. అయితే, పెట్రోలు సమస్యను అధిగమించడానికి, ప్రజల రవాణా సౌకర్యాన్ని సులభతరం చేయడానికి క్యూబా ఇటీవల సోలార్‌ ఆటోలను రంగంలోకి దించింది. 

చైనాలో తయారైన సోలార్‌ ఆటోలను దిగుమతి చేసి, స్థానిక ఆటో డ్రైవర్లకు అందుబాటులోకి తెచ్చింది. వీటి ధర ఒక్కొక్కటి రెండువేల నుంచి నాలుగువేల డాలర్ల వరకు ఉంటోంది. వీటిని ప్రజల రవాణాతో పాటు సరుకుల రవాణా కోసం కూడా వాడుతున్నారు. క్యూబా నగరాలు, పట్టణాల్లో ఒకప్పుడు బస్సులు, ట్యాక్సీలు తిరిగిన వీథుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సోలార్‌ ఆటోలే దూసుకుపోతూ కనిపిస్తున్నాయి.

ఇవీ చదవండి: ఏఐతో వైరస్‌ సృష్టి.. మానవాళికి వరమా? శాపమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement