సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి, దివంగత నటి శ్రీదేవి-నిర్మాత బోనీ కపూర్ ల చిన్నకుమార్తె ఖుషీ కపూర్ తన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోకు కొత్త ఆస్తిని జోడించింది. ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో కొత్త అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసింది.CRE మ్యాట్రిక్స్‌కు లభించిన ఆస్తి రికార్డుల ప్రకారం బాలీవుడ్ ప్రముఖులు నివాసముండే పాపులర్ ఏరియా, బాంద్రా వెస్ట్‌లోని 25వ రోడ్డులో ఉన్న సమతాదీప్ బిల్డింగ్‌లో ఈ అపార్ట్‌మెంట్ ఉంది.
దీని ధర సుమారు రూ. 63 లక్షలు. ఈ లావాదేవీ సెప్టెంబర్ 1 అధికారికంగా రిజిస్టర్ చేయబడింది. ఈ డీల్‌కు స్టాంప్ డ్యూటీ కింద రూ. 3.15 లక్షలు చెల్లించినట్టు సమాచారం.కార్పెట్ ఏరియా 180 చదరపు అడుగులు ఈ ఫ్లాట్‌ను ఫారూఖ్ ఛాగ్లా అనే వ్యక్తి నుంచి ఈ ప్రాపర్టీని ఆమె కొనుగోలు చేసినట్లు పత్రాల ద్వారా తెలుస్తోంది.
కాగా 2023లో జోయా అక్తర్ దర్శకత్వం వహించిన 'ది ఆర్చీస్' (The Archies) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిందిఖుషీకపూర్. ఆ తర్వాత ఇబ్రహీం అలీ ఖాన్‌తో కలిసి 'నాదానియాన్', జునైద్ ఖాన్‌తో కలిసి 'లవ్‌యాపా' చిత్రాల్లో నటించారు. తన తల్లి శ్రీదేవి నటించిన హిట్ చిత్రం 'మామ్' (Mom - 2017) కి సీక్వెల్‌గా వస్తున్న 'మామ్ 2' (Mom 2) లో ఖుషీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో జిష్షూ సేన్‌గుప్తా, కరిష్మా తన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఎమోషనల్ థ్రిల్లర్‌లో ఖుషీ అత్యంత బలమైన, ఆకట్టుకునే నటనను కనబరచనున్నట్లు సమాచారం.అటు ఖుషీ సోదరి జాన్వీ కపూర్‌కూడా బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: రూ. 6వేలతో మొదలై, రూ.1400 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు
ఇదీ చదవండి: రూ. 46 లక్షల జీతాన్ని వదిలేసి, డ్రీమ్ జాబ్ ఎంచుకున్న టెకీ


