జియో రీచార్జ్‌ ప్లాన్‌: 200 రోజులు అన్‌లిమిటెడ్‌ బెనిఫిట్లు! | Jio Recharge plan 200 day validity daily 2 5GB data AI OTT benefits | Sakshi
Sakshi News home page

జియో రీచార్జ్‌ ప్లాన్‌: 200 రోజులు అన్‌లిమిటెడ్‌ బెనిఫిట్లు!

Sep 5 2026 3:39 PM | Updated on Sep 5 2026 3:46 PM

Jio Recharge plan 200 day validity daily 2 5GB data AI OTT benefits

దీర్ఘకాలిక రీచార్జ్‌ ప్లాన్‌ కోసం చూస్తున్న వినియోగదారులకు దేశీయ ప్రముఖ టెలికమ్‌ ఆపరేటర్‌ జియోలో ఆకర్షణీయ ప్లాన్‌ అందుబాటులో ఉంది. తరచూ రీచార్జ్‌ చేసుకునే అవసరం లేకుండా ఎక్కువ వ్యాలిడిటీతో పాటు డేటా, కాలింగ్‌, ఓటీటీ, క్లౌడ్‌ స్టోరేజ్‌, ఏఐ సేవలు అందించే ప్లాన్‌ను జియో అందిస్తోంది. రూ.2,025 ధర కలిగిన ఈ ప్లాన్‌ 200 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో మొత్తం 500GB హైస్పీడ్‌ డేటాతో పాటు పలు అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.

ప్లాన్‌ ప్రయోజనాలు

జియో రూ.2,025 ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో మొత్తం 500GB డేటా లభిస్తుంది. అంటే రోజుకు సగటున 2.5GB హైస్పీడ్‌ డేటాను వినియోగించుకోవచ్చు. నిర్దేశిత డేటా పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్‌ వేగం 64Kbpsకు తగ్గుతుంది. అర్హత కలిగిన వినియోగదారులకు అపరిమిత 5G డేటా కూడా అందుబాటులో ఉంటుంది.

డేటాతో పాటు ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ సదుపాయం ఉంది. అలాగే ప్రతిరోజూ 100 SMSలను ఉచితంగా పంపుకోవచ్చు. దీంతో కాలింగ్‌, SMS కోసం ప్రత్యేకంగా మరో ప్యాక్‌ను తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

ఈ ప్లాన్‌ ప్రత్యేకత కేవలం డేటా, కాలింగ్‌కే పరిమితం కాదు. ఇందులో జియో హాట్‌స్టార్‌ మొబైల్‌ (Mobile + Hollywood) సబ్‌స్క్రిప్షన్‌ కూడా లభిస్తుంది. అలాగే జియో ఏఐ క్లౌడ్‌లో 50GB ఉచిత క్లౌడ్‌ స్టోరేజ్‌ పొందవచ్చు.

ఇక ఏఐ సేవలను వినియోగించుకునే వారికి మరో కీలక ప్రయోజనం ఉంది. అర్హత కలిగిన కస్టమర్లకు 18 నెలల గూగుల్‌ జెమినై ప్రో (Google Gemini Pro) సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది. వాస్తవంగా దీని విలువ రూ.35,100 ఉంటుంది. ఈ సబ్‌స్క్రిప్షన్‌తో 5,000GB క్లౌడ్‌ స్టోరేజ్‌, న్యానో బనానా సహా పలు AI ఫీచర్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement